ఇప్పుడు విజయ్ కోసం ఒక పొలిటికల్ కథను కూడా సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా ఈ చిత్రంలో నటించేటువంటి కథానాయకుల గురించి ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది. ఇందులో ఇప్పటికే సమంత, కీర్తి సురేష్ నటిస్తున్నారని వార్తలు కూడా వినిపించాయి.. అయితే ఈ విషయం పైన చిత్ర బృందం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా ఈ చిత్రంలో ప్రేమలు సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న మమతా బైజు కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
ఈ విషయం అయితే కోలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. విజయ్ తో సినిమా అని చెప్పగానే మమత బైజు కూడా తన పాత్ర ఏంటా అంటూ చాలా ఎక్సైటింగ్ గా అడిగి మరి కాంట్రాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. కథలో ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉండడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒక వేళ కథ పరంగా పాత్ర పరంగా మమత బైజుకి పేరు వచ్చిందంటే చాలు ఇక ఈ ముద్దుగుమ్మ సినీ కెరియర్ ఒక్కసారిగా మారిపోతుందని చెప్పవచ్చు. మరి ఈ విషయం పైన చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటిస్తుందో లేదో చూడాలి.