నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది రాశి కన్నా. ఈ సినిమాలో ఈమె తన నటనతో , హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంది. దానితో ఈమెకు తెలుగులో అవకాశాలు పెరిగాయి. ఇక మొదటి సినిమాలో అందాల ఆరబోతకు చాలా దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఆ తర్వాత మాత్రం తన అందాలను విపరీతంగా ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయలేదు.

అందులో భాగంగా ఈ బ్యూటీ తాను నటించిన చాలా సినిమాలలో తన నటనతో మాత్రమే కాకుండా గ్లామర్ షో తో కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. దానితో ఈమెకు తెలుగు సినిమాల్లో అవకాశాలు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికి కూడా ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. తెలుగు తో పాటు రాశి ఖన్నా ప్రస్తుతం వరుస తమిళ , హిందీ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీఈవెంట్ కు వెళ్ళింది. అందులో భాగంగా ఈమె ఓ స్టార్ హీరోలా లైఫ్ ను లీడ్ చేయాలి అని ఉంది అని చెప్పుకొచ్చింది.

బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లా లైఫ్ లీడ్ చేయాలని ఉంది. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. సినిమా అంటే అతనికి చాలా ఇష్టం. సినిమా కోసం ఏదీ చేయడానికి అయిన ఆయన అస్సలు వెనకాడడు. అలాంటి గొప్ప వ్యక్తుల లైఫ్ లీడ్ చేయాలని ఉన్నట్లు రాశి కన్నా తాజాగా చెప్పుకొచ్చింది. ఇకపోతే రాశి కన్నా కొంత కాలం క్రితం తమిళ సినిమా అయినటువంటి "అరుణ్మనై 4" అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో ఈ బ్యూటీ నటనతో మాత్రమే కాకుండా అందాలతో కూడా ప్రేక్షకులను కట్టి పడేసింది. ప్రస్తుతం కూడా ఈమె చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: