తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన మాస్ ఈమేజ్ కలిగిన హీరోలలో గోపీచంద్ ఒకరు. ఈయన తొలి వలపు అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో గోపీచంద్ హీరోగా నటించాడు. గోపీచంద్ హీరోగా నటించిన మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కాలేదు. దానితో ఆ సినిమా తర్వాత గోపీచంద్ కు అవకాశాలు కూడా పెద్దగా రాలేదు. ఇక కొంత కాలం పాటు ఖాళీగా ఉన్న గోపీచంద్ కు తేజ దర్శకత్వంలో రూపొందిన జయం మూవీ లో విలన్ గా అవకాశం వచ్చింది. దానితో ఈయన జయం మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

ఇక ఆ తర్వాత వరుసగా వర్షం , నిజం సినిమాలలో కూడా గోపీచంద్ విలన్ పాత్రలో నటించాడు. వాటి ద్వారా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక మళ్ళీ హీరోగా నటించాలి అనే ఉద్దేశంతో గోపీచంద్ "యజ్ఞం" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈయనకు వరుసగా హీరోగా అవకాశాలు దక్కాయి. దానితో ఇప్పటి వరకు ఈయన విలన్ పాత్రఎల్ నటించకుండా హీరోగానే కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే గోపీచంద్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే 23 సంవత్సరాలు అవుతుంది. 

చాలా కాలం క్రితం గోపీచంద్ ఓ ఇంటర్వ్యూ లో భాగంగా తనను రెండు సినిమాలు ఎంతో బాధపెట్టాయి అని చెప్పుకొచ్చాడు. నా కెరీర్ లో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే సినిమాలు తెరకెక్కిస్తున్న సమయంలో ఓ రెండు సినిమాలు మాత్రం అద్భుతమైన విజయాలు అందుకుంటాయి అనుకున్నాం అలా కాలేదు అని అన్నాడు. ఆ రెండు సినిమాలలో అతనొక్కడే , గౌతమ్ నంద మూవీలు ఉన్నట్లు గోపీచంద్ తెలియజేశాడు. ఇకపోతే అతనొక్కడే , గౌతమ్ నంద సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయిన ఈ సినిమాలకు బుల్లి తెరపై మాత్రం ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: