స్పీడ్ గా స్క్రిప్ట్ రాసుకోవడమే కాదు అంతే స్పీడ్ గా సినిమాలను తీసి మూడు నెలల వ్యవధిలోనే సినిమాలను తెరకేక్కించి విడుదల చేసే ఘనత కూడా అటు పూరికే దక్కింది అని చెప్పాలి. ఇలా ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ సినిమాలను తీసిన పూరి గత కొంతకాలం నుంచి మాత్రం పెద్దగా సక్సెస్ లు అందుకోలేకపోతున్నాడు. భిన్నమైన కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఎందుకో పూరి సినిమాలు ఒకప్పటిలా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. అయితే లైగర్ అనే సినిమాతో దారుణమైన డిజాస్టర్ చూసి బాగా నష్టపోయిన పూరి.. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి.
ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన హీరో రామ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాని చెప్పుకొచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాను మించి ఉండాలి అనే ఉద్దేశంతో డబుల్ ఇస్మార్ట్ స్టోరీ పూరి రాశాడు అంటూ రామ్ చెప్పుకొచ్చాడు. పూరి ఎక్కువ సమయం తీసుకున్న స్క్రిప్ట్ ఇదే అంటూ తెలిపాడు. ఇక డబుల్ ఇస్మార్ట్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ వ్యాఖ్యలు చేశాడు. పూరితో పనిచేసేటప్పుడే కాకుండా అతని స్క్రిప్ట్ వింటున్నప్పుడు కూడా కిక్ వస్తుంది అంటూ రామ్ కామెంట్ చేశాడు. కమర్షియల్ సినిమాలు తెరకెక్కించడం అంత సులువు కాదని పేర్కొన్నాడు రామ్. కాగా ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కాబోతుంది.