తమిళ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో శరణ్య ఒకరు. ఈమె ఎక్కువ శాతం సినిమాలలో తల్లి పాత్రలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈ నటి నా కెరియర్ లో నేను ఒక సినిమాలో ఇష్టం లేకపోయినా నటించాను. కాకపోతే విడుదల తర్వాత ఆ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. అలాగే ఆ సినిమాలోని నా పాత్రకు కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి అని చెప్పుకుంది.

అసలు విషయం లోకి వెళితే ... తాజా ఇంటర్వ్యూ లో భాగంగా శరణ్య మాట్లాడుతూ ... ధనుష్ హీరోగా రూపొందిన రఘువరన్ బీటెక్ సినిమాలో నేను ధనుష్ కి తల్లి పాత్రలో నటించాను. ఇకపోతే ఒక రోజు ధనుష్ నేను ఒక సినిమాను చేయబోతున్నాను. అందులో మీ కోసం ఒక పాత్ర అనుకుంటున్నాను. నేను ఈ రోజు మీ ఇంటికి వచ్చి ఆ కథ చెబుతాను అని అన్నాడు. దానితో ధనుష్ వస్తాడు అని నేను ఎదురు చూశాను. ఆయన వచ్చాడు కథ చెప్పాడు. ఆ కథ నాకు పెద్దగా నచ్చలేదు. ఆ మూవీలో తల్లి పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు.

అలాగే మధ్యలోనే తల్లి పాత్ర చనిపోతుంది అని చెప్పాడు. దాని వల్ల నాకు ఆ సినిమా కథ ఏ మాత్రం నచ్చలేదు. దానితో కథ నచ్చలేదు. అందులో నా పాత్ర నచ్చలేదు సినిమా చేయను అని ధనుష్ కి చెప్పాను. దానితో ధనుష్ మీరు కచ్చితంగా ఈ సినిమా చేయండి. విడుదల తర్వాత ఈ సినిమా ద్వారా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే ఈ సినిమాలో తల్లి గురించి ఒక అద్భుతమైన పాట కూడా ఉంటుంది అని చెప్పాడు. దానితో కూడా నేను కన్విన్స్ కాలేదు. కానీ ధనుష్ అంతగా అడుగుతున్నాడు అనే ఉద్దేశంతో ఆ సినిమా చేశాను. ఇక విడుదల అయిన తర్వాత ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. నాకు కూడా ఆ మూవీ లోని పాత్ర ద్వారా అద్భుతమైన గుర్తింపు దక్కింది అని శరణ్య తాజా ఇంటర్వ్యూ లో బాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: