తాజాగా హైదరాబాద్‌లో ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 వేడుకలు జరగగా.. అవార్డుల ప్రదానోత్సవంలో పాయల్ రాజ్‌పుత్ సందడి చేశారు.ఇక కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తన గ్లామర్ ఫొటోలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టే ఈ చిన్నది తాజాగా ఫిలిం ఫేర్ అవార్డుల వేడుకల్లో పాల్గొంది. ఈ వేడుకలో పాల్గొన్న పాయల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇప్పటి వరకు మీ గురించి వచ్చిన ఫన్నీ రూమర్ ఏంటి.? అని ప్రశ్నకు బదులిస్తూ.. ప్రభాస్‌తో నా పెళ్లి అయ్యిందటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. వాటిని చూసి బాగా నవ్వుకున్నాని, అది నిజమైతే బాగుండని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది పాయల్.ఇక తన జీవితాన్ని వేరే నటి లేదా నటుడి లైఫ్‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాలనుకుంటే ఎవరిని ఎంచుకుంటారన్నన అడగ్గా.. తనకు అలాంటి ఉద్దేశం ఏదీ లేదని. ప్రస్తుతం తాను ఎంతో సంతోషంగా ఉన్నాని చెప్పుకొచ్చింది. చుట్టూ ఉన్నవారిని ప్రేమిస్తున్నానని, వాళ్లంతా తనపై చూపించే ప్రేమాభిమానాల వల్ల జీవితం మరింత అందంగా మారిందని చెప్పుకొచ్చింది.ఇది ఇలా ఉంటే గతంలో కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టిని ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని వార్తలు వినిపించాయి. కానీ అవేవీ వాస్తవాలు కాదని తేలింది. అయితే రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ తో ప్రభాస్ లవ్‌లో ఉన్నారంటూ కూడా టాక్ వినిపించింది. ఇక మొత్తానికి ప్రభాస్ పెళ్లి ఎవరితో అనేది ఇప్పట్లో తీరని సస్పెన్స్ అనే చెప్పాలి.