కల్కి 2898 ఏడి సినిమా వచ్చి నెల దాటినా కూడా ఇంకా థియేటర్ నుండి ప్రేక్షకుల మైండ్ నుండి ఈ సినిమా పోవడం లేదు.ఈ సినిమాని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 1150 కోట్ల కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఇంకా థియేటర్లలో ఆడుతోంది. అయితే అలాంటి ఈ సినిమా పార్ట్ -2 కి సంబంధించి ప్రేక్షకుల్లో ఒక ఆసక్తి అయితే నెలకొంది. అయితే కల్కి 2898 ఏడి మూవీలో కల్కి పాత్రలో ప్రభాస్ అని అందరూ అనుకున్నారు.కానీ తీరా సినిమా చూశాక ప్రభాస్ కల్కి పాత్రలో కాదు కర్ణుడి పాత్రలో కనిపించాడు. అలాగే అశ్వద్ధామగా అబితాబ్ కనిపించాడు. అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించారు. ఇక సుమతి అంటే హీరోయిన్ దీపిక పదుకొనే కడుపులో కల్కి పెరుగుతాడు.  కల్కి ఎవరో కాదు శ్రీకృష్ణుడే..మహాభారత యుద్ధంలో అశ్వద్ధామకి శ్రీకృష్ణుడు శాపం పెడతాడు. 

భూమ్మీద జరిగేవి అన్ని చూసుకుంటూ ఏమి చేయలేక దిక్కుతోచని స్థితిలో ఉంటావు అని శపిస్తాడు.మళ్లీ దానికి విముక్తిగా నేను కల్కి రూపంలో మళ్ళీ పుడతాను. ఆ సమయంలో నా గర్భానికి నువ్వే కాపలాగా ఉంటావు అదే నీకు శాప విముక్తి అని కృష్ణుడు చెబుతాడు. అలా దీపికా పదుకొనే గర్భంలో పెరిగే కల్కి ని అశ్వద్ధామ పాత్రలో చేసే అమితాబ్ కాపలాగా ఉంటాడు. ఇక చివర్లో ప్రభాస్ ని కర్ణుడిగా చూపించారు.అయితే అందరూ ప్రభాస్ ని కల్కి అనుకున్నారు.కానీ సినిమాలో కర్ణుడిగా కనిపించారు. ప్రభాస్ హీరో కాబట్టి కల్కి పార్ట్ -2 లో కల్కి పాత్రలో ప్రభాసే కనిపిస్తారు అని అందరూ భావిస్తున్నారు.కానీ  టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం..వైజయంతి మూవీస్ బ్యానర్ వాళ్ళు కల్కి పాత్ర కోసం ఓ స్టార్ హీరోని తీసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నారట.

కల్కి పాత్రలో నటించడం కోసం మొదటి ఎంపికగా పవన్ కళ్యాణ్ ని అనుకున్నారట. ఒకవేళ ఆయన రాజకీయాలతో బిజీగా ఉండి నో చెబితే జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకోవాలి అని చూస్తున్నారట. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆయన చేసే సినిమాలనే పక్కన పెట్టారు.కాబట్టి ఈ సినిమాలో నటించకపోవచ్చు.ఇక ఎన్టీఆర్ అయితే ఓకే చెబుతారు కావచ్చు అని ఈ విషయం తెలిసిన జనాలు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభాస్ ఎన్టీఆర్ ని ఒకే స్క్రీన్ పై చూస్తే బాక్సాఫీస్ బద్దలే అని కొంతమంది భావిస్తున్నప్పటికీ ప్రభాస్ అభిమానులు మాత్రం కల్కి పాత్రలో కూడా ప్రభాసే నటిస్తారని భావిస్తున్నారు.మరి కల్కి పాత్రలో ప్రభాస్ ని చూపిస్తారా లేక ఆ పాత్ర కోసం మరో హీరోని ఎంచుకుంటారా అనేది తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: