త్రిష నటించిన లేటెస్ట్ వెబ్ సీరీస్ బృంద రీసెంట్ గా సోనీ లివ్ ఓటీటీలో రిలీజైంది. ఈ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ సీరీస్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుందని తెలుస్తుంది. 40 ప్లస్ ఏజ్.. 20 ఏళ్ల కెరీర్ తర్వాత కూడా త్రిష ఇప్పటికీ లీడ్ రోల్స్ తెచ్చుకుంటుంది. ఈ క్రమంలో త్రిష వెబ్ సీరీస్ లలో నటిచడం కూడా సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది.
త్రిష బృంద సినిమాతో వన్ మోర్ సిక్స్ కొట్టినట్టే అని అనిపిస్తుంది. కచ్చితంగా అమ్మడు ఓటీటీలో కూడా మరికొన్నాళ్లు తన హవా చూపించేలా ఉంది. తనదైన శైలిలో కథలు ఎంపిక చేసుకుంటూ అటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలు కూడా చేస్తున్న త్రిష ఇదే ఫాం కొనసాగిస్తే మాత్రం ఇంకా 10 ఏళ్లు ఆమె అలానే ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం త్రిష తమిళ్ లో రెండు క్రేజీ సినిమాల్లో నటిస్తుండగా తెలుగులో చిరు సరసన విశ్వంభర సినిమాలో కూడా భాగం అవుతుంది. తెలుగులో కూడా ఆఫ్టర్ లాంగ్ టైం రీ ఎంట్రీ ఇస్తున్న త్రిష విశ్వంభర హిట్ పడితే ఇక్కడ కూడా వరుస ఛాన్సులు అందుకునేలా ఉంది. త్రిష దూకుడు చూస్తుంటే మాత్రం యువ హీరోయిన్స్ కూడా షాక్ అయ్యేలా ఉందని చెప్పొచ్చు.