మాస్ మహారాజ్ రవితేజ ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. రవితేజ కామెడీ అంటే ప్రేక్షకులు బాగా చూస్తారు. రవితేజ కామెడీ చూసి పొట్ట పగిలేలా నవ్వుతూ ఉంటారు. రవితేజ ని కామెడీ మెన్ గా చెప్పుకోవచ్చు.బాక్స్ ఫిస్ దగ్గర బోల్తా కొట్టిన మాస్ మహారాజ్ రవితేజ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈగల్ ఇప్పుడు మరో ఓటీటీలోను అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ లాంటి ఓటిటిల్లోకి స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా..ఇప్పుడు ఆరు నెలల తరువాత సన్ నెక్ట్స్ ఓటిటిలోనూ స్ట్రీమింగ్ కు రావడం విశేషం. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన రవితేజ మూవీ ఈగల్.


మాస్ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్న..నెల రోజులు ఆలస్యంగా వచ్చింది. అయితే అసలు అంచనాలను అందుకోలేక బాక్స్ ఫీస్ దగ్గర బోల్తా పడింది. చాలా రోజుల కిందడే ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ ఓటీటీ ల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా తమ ఫాట్ ఫామ్ పై కూడా సినిమా స్ట్రీమింగ్ కు వచ్చినట్లు సన్ నెక్ట్స్ ఓటిటి తెలిపింది. ఈగల్ కథ చాలా చిన్నది. కేవలం రవితేజ క్యారెక్టర్ ను నమ్మే రెండున్నర గంటలు నడిపించే ప్రయత్నంలో దర్శకుడు చాలా కంగాళీగా కలగపులంగా చేసినట్లు అనిపిస్తుంది. చాలా చోట్ల లాజిక్స్ వదిలేశాడు. చేనేత వస్త్రాలు, ఆక్రమ ఆయుధాల వ్యాపారం రెండింటి మధ్య సింక్ కుదరనట్లుగా అనిపిస్తుంది.


విక్రమ్, కేజిఎఫ్ స్ఫూర్తితోనే ఈ సినిమా చేసినట్లుగా అనిపిస్తుంది. ఎలిమినేషన్స్ మొత్తం ఆ సినిమాలను గుర్తుకు తెస్తాయి. సహదేవ వర్మగా రవితేజ స్ట్రీరిష్ గా అనిపించాడు. రవితేజ ఎలిమినేషన్స్, యాక్షన్ సీన్స్ లో అతడి ఎనర్జి మెప్పిస్తుంది. డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంది. నళీనిరావు అనే జర్నలిస్ట్ గా అనుపమ యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్ర చేసింది. రచనగా కావ్య థాపర్ సినిమాలో కనిపించేది తక్కువ డైమే. రవితేజతో ఆమె కెమిస్ట్రీ బాగుంది. రవితేజ అసిస్టెంట్ గా నవదీప్ తో పాటు మధుబాల, శ్రీనివాస్ అవసరాల ప్రతి ఒక్క పాత్రను ఇంట్రెస్టింగ్ గా డైరెక్టర్ రాసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: