మెగాస్టార్ నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నిర్మాతగా చేస్తుంది. చాలా రోజులు సినిమాల్లో నటించేది. కానీ అక్కడ మానేసి నిర్మాతగా చేస్తుంది. నిహారిక నిర్మాతగా వ్యవహరించిన సినిమా 'కమిటీ కుర్రోళ్లు'.15 మంది కొత్త నటులతో దర్శకుడు యదు వంశీ తర్కెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇందులో నుంచి వచ్చిన ప్రతి పోస్టర్తో పాటు ఆప్ డేట్స్ ఎంతో ఆకట్టుకోగా..రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు చిత్ర బృందం.


ఈ క్రమంలోనే తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెగా డాటర్ నిహారిక మాట్లాడుతూ..సినిమాపై, తన ఫ్యామిలీ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. 'ఈ సినిమాలో ప్రేక్షకులకు పరిచయం ఉన్న ఆర్టిస్టులను పెట్టాలి అనుకున్నాను. కానీ కొత్త వారితో చేద్దామని డైరెక్టర్ వంశీ అన్నారు. కానీ ఇప్పుడు 15 మంది టాలెంట్ ఉన్న కొత్త ఆర్టిస్టులను ఇండస్ట్రీకి ఇచ్చాననే తృప్తిని నాకు ఇచ్చారు. ఆగస్టు 9 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మీకు ఇది నచ్చుతుందని..మీరు అందరూ దీన్ని ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను' అంటూ చెప్పుకొచ్చింది.


అలాగే ఫ్యామిలీ గురించి చెప్తూ..'మా అన్నయ్య వరుణ్ నాకు ఎంతో సపోర్టుగా ఉన్నాడు. ఇక అందరూ బాగుండాలి, ఆనందంగా ఉండాలని కోరుకునే మా బావ (సాయి దుర్గా తేజ్) ఈ ఈవెంట్ కు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం మా కుటుంబానికి అద్భుతంగా ఉంది. మా పెద్ద నాన్నకు పద్మవిభూషన్ వచ్చింది. బాబాయి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక చరణ్ అన్న సినిమా ఆస్కార్స్ కు వెళ్లింది..అలాగే నేను కూడా నిర్మాతగా నా ఫస్ట్ సినిమాతో వస్తున్నాను. ఇలాగే మీరు అందరూ మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: