ఐతే ఈ సినిమాలో డీజే టిల్లు అదే మన సిద్ధు జొన్నలగడ్డ కూడా ఉంటాడన్న న్యూస్ తెలిసిందే. ఐతే ఇప్పుడు సిద్ధు ఎప్పుడు వస్తాడు అన్నది లీక్ అయ్యింది. సినిమా ముగుస్తుంది అనే టైం లో ఒక ఫైట్ సీన్ లో సిద్ధు జొన్నలగడ్డ ఎంట్రీ ఉంటుందట. అది కూడా ఒక రేంజ్ లో ఉంటుందని టాక్. సిద్ధు ఒక 2, 3 నిమిషాలు మాత్రమే ఉంటాడట కానీ అతను ఉన్నంత సేపు మాత్రం థియేటర్ షేక్ అవుతుందని అంటున్నారు.
ఇప్పటికే మిస్టర్ బచ్చన్ ప్రమోషనల్ కంటెంట్ చూసి మాస్ ఆడియన్స్ అంతా సినిమా ఫస్ట్ షోనే చూసేయాలి అనుకుంటుండగా ఇప్పుడు సిద్ధు సీన్ గురించి వచ్చిన ఈ న్యూస్ తో ఫ్యాన్స్ లో మరింత ఎగ్జైట్ మెంట్ మొదలైంది. ఆగష్టు 15న రిలీజ్ అవుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా కచ్చితంగా మాస్ ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలతో ఒక మంచి స్క్రీన్ ప్లేతో వస్తుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాలో ఇన్ని హైలెట్స్ ఉన్నాయి కాబట్టి సినిమా పక్కా హిట్ అనేసేయొచ్చు అనేస్తున్నారు ఆడియన్స్. మరి సినిమా ఏమేరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి.