ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో ఇలియానా కూడా ఒకరు.. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ అనుకోకుండా తన కెరియర్ ఒక్కసారిగా పడిపోయింది. ముఖ్యంగా ఈమె అధికంగా బరువు పెరగడంతో ఈమెకు అవకాశాలు కూడా రాలేకపోయాయి. బాలీవుడ్లో అడపాదపా సినిమాలలో నటించిన ఇలియానా అక్కడ కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో కరోనా సమయం నుంచి సినిమాలను తగ్గించేసింది. అంతేకాకుండా విదేశాలకు చెందిన మైకేల్ డొలన్ అనే వ్యక్తిని ప్రేమించి మరి వివాహం చేసుకుంది.


అయితే పెళ్లి చేసుకొని ఒక బాబుకు కూడా జన్మనిచ్చింది ఆ బాబు పుట్టాక కేవలం కుటుంబానికి పరిమితమైంది ఇలియానా. ఆ తర్వాత అప్పుడప్పుడు తన భర్తతో దిగిన కొన్ని ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తన బాబుకి ఫినిక్స్ డోలాన్ అనే పేరు కూడా పెట్టింది. తాజాగా తన భర్త కొడుకు సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేయగా ఇలియానా తన కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేషన్ చేయకుండా కేవలం తన ఇంట్లోనే సింపుల్ గా సెలబ్రేషన్ చేసినట్లుగా కొన్ని ఫోటోలను సైతం షేర్ చేసింది.


అలాగే తన భర్త కొడుకుతో కలిసి క్యూట్ గా ఉన్న కొన్ని ఫోటోలను సైతం ఇలియానా షేర్ చేయగా అభిమానులు ఈ ఫోటోలను తెగ వైరల్ గా చేస్తున్నారు. ఇలియానా కొడుకు చాలా క్యూట్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.తన కుమారుడి మొదటి పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలియజేస్తున్నారు అభిమానులు.. అయితే తనని మాత్రం మళ్ళీ తిరిగి సినిమాలలోకి రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.. మరి అభిమానుల కోరిక మేరకు ఇలియానా రీయంట్రీ ఇస్తుందో లేదో చూడాలి మరి. ప్రస్తుతం ఇలియానా తన కుమారుడికి సంబంధించి షేర్ చేసిన ఈ ఫోటోలు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: