టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో సమంత గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి పరిచయమైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా సమంతకు ఎంతోమంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో సమంత నటనను చూసిన ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇందులో సమంత నాగచైతన్య సరసన హీరోయిన్గా నటించింది. మొదటి పరిచయంలోనే సమంత, నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఆ సినిమా సమయంలోనే ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు.


అతితక్కువ సమయంలోనే ఇద్దరు మధ్య ప్రేమ ఏర్పడింది. కొద్దిరోజుల పాటు వీరి ప్రేమను రహస్యంగా కొనసాగించిన ఈ జంట. కొన్ని సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో వివాహాన్ని చేసుకున్నారు. వివాహ అనంతరం ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. అయితే సమంత వివాహానికి ముందు నాగచైతన్య దగ్గర ఒక విషయాన్ని దాచి పెట్టిందట. సమంతకు రాత్రి నిద్రలో మాట్లాడే అలవాటు ఉందట.


గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఏదేదో కలవరిస్తూ.... మాట్లాడుతూ ఉంటుందట. ఇక వివాహ అనంతరం ఈ విషయం తెలిసిన నాగచైతన్య షాక్ అయ్యారట. వెంటనే సమంతను హాస్పిటల్ కి తీసుకెళ్లి డాక్టర్ కి చూపిస్తే అదేమీ పెద్ద సమస్య కాదని.... చాలామందికి అలవాటు ఉంటుందని చెప్పి పంపించారట. డాక్టర్ చెప్పిన తర్వాత నాగచైతన్య కాస్త రిలాక్స్ అయ్యారట. ఆ తర్వాత యధావిధిగా వారి వైవాహిక జీవితం సంతోషంగా కొనసాగింది. ఇక ఏమైందో తెలియదు ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారు. ఈ విషయం తెలిసి చాలామంది షాక్ అయ్యారు.


ఇప్పటికి వీ రు విడాకులు తీసుకొని మూడు సంవత్సరాలపైనే అవుతుంది. వీరి విడాకులకు గల కారణాలు ఇప్పటివరకు తెలియ రాలేదు. ప్రస్తుతం ఈ జంట విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. విడాకులు అనంతరం ఎవరికివారు వారి పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉంటున్నారు. ఇప్పటికీ జంట కలుసుకోవాలని సమంత కుటుంబ సభ్యులు, చైతన్య కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: