పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా కల్కి. అమితాబచ్చన్, కమలహాసన్, దీపికా పదుకొనే వంటి స్టార్కాస్ట్ ఉన్న ఈ సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చింది. పౌరాణిక సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా దాదాపుగా 1300 కోట్ల వరకు భారీ వసూళ్లు అందుకుంది. అయితే ఇప్పటికే ఈ సంవత్సరంలో అతిపెద్ద హిట్ గా నిలిచిన ఈ సినిమా ఉత్తర అమెరికాలో సైతం అత్యధిక కలెక్షన్ సాధించింది.కల్కి సినిమా థియేటర్లలో విడుదలై దాదాపు 40 రోజులు పూర్తయిపోయింది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా

 అక్కడక్కడా ఆడుతున్నప్పటికీ థియేట్రికల్ రన్ దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది.  కల్కి సినిమా ఏకంగా రెండు ఓటీటీల్లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఆగస్ట్ 23 నుంచి కల్కిని డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధింంచి ఒక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. భారతదేశంలో అత్యధిక వసూళ్లు చేసిన నాల్గవ చిత్రంగా షారూఖ్ ఖాన్ యొక్క “జవాన్”ను

 అధిగమించింది. “పఠాన్,” “జవాన్,” మరియు “డంకీ” అనే మూడు బ్యాక్-టు-బ్యాక్ హిట్‌లతో 2023 సంవత్సరంలో షారుఖ్ ఖాన్‌ కింగ్ ఖాన్ అనిపించుకున్నాడు.  ఇక “జవాన్” భారతదేశంలో రూ. 640.25 కోట్లు వసూలు చేసి హిందీ సినిమాలలో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. మరియు “RRR,” “KGF 2,” మరియు “బాహుబలి 2: ది కన్‌క్లూజన్” తర్వాత అత్యధిక వసూళ్లు చేసిన నాల్గవ భారతీయ చిత్రంగా నిలిచింది. అయితే ఎట్టకేలకు రూ.640.25 కోట్లకు పైగా వసూళ్లు సాధించి “జవాన్” రికార్డును పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన  “కల్కి 2898 క్రీ.శ.” అధిగమించడంతో ఇప్పుడు రికార్డులు తిరగరాసినట్టు అయింది. "..!!

మరింత సమాచారం తెలుసుకోండి: