విశ్వ నటుడు కమలహాసన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. కేవలం హీరోగానే కాకుండా దర్శకుడుగా నిర్మాతగా గాయకుడిగా మాటల రచయితగా నృత్య దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న ఆయన హిందీలో బిగ్ బాస్ కి హోస్టుగా కూడా వ్యవహరించాడు. అయితే 2015లో బిగ్ బాస్ ప్రారంభమైంది. దీనికి హోస్ట్ గా వ్యవహరించాడు కమల్ హాసన్. అయితే ఇప్పుడు రాబోయే కొత్త సీజన్‌ని కూడా కమల్ నే హోస్టింగ్ చేయాలన్నది అభిమానుల కోరిక. అయితే అంతకు ముందే షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు

 కమల్. ఈసారి తాను బిగ్ బాస్ షోకి హోస్ట్ చేయనని సూటిగా చెప్పారు. కమల్ హాసన్ తన నిర్ణయం వెనుక కారణాన్ని కూడా వివరించారు. సాధారణంగా బిగ్ బాస్ హోస్ట్ మార్పుపై సోషల్ మీడియాలో పలు రూమర్లు, పుకార్లు వస్తుంటాయి. అయితే ఇప్పుడు కమల్ హాసన్ గురించి వినిపిస్తున్నది గాసిప్ కాదు. ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన అభిమానులకు ఓ లేఖ రాశారు. గతేడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 7లో ప్రదీప్ ఆంటోనీ కంటెస్టెంట్‌లలో ఒకరు. కొంత నత్తిగా ఆట ఆడినా, గేమ్‌లో

 నిజాయితీగా ఉన్నాడు. అయితే అతడిని ఎలాగైనా ఎలిమినేట్ చేయించాలని చూసిన కొందరు కంటెస్టెంట్ల ప్లాన్ ఫలించింది. ప్రదీప్ పై వచ్చిన ఆరోపణలను సరిగ్గా విచారించకుండా.. మహిళలకు రక్షణ లేదంటూ కొందరు చెప్పిన నీచమైన మాటలు నమ్మి కమల్ హాసన్ ప్రదీప్ ఆంటోనీకి రెడ్ కార్డ్ ఇచ్చారు. అలా  ప్రదీప్‌ ఆంటోనీకి అన్యాయం చేసినట్టు అక్కడ చాలా మంది నమ్మారు. నిజానికి గత ఆరు సీజన్లలో లేదు కానీ ఏడో సీజన్‌లో కమల్ హాసన్ రకరకాల విమర్శలను ఎదుర్కొన్నాడు. కమల్ హాసన్ బిగ్ బాస్ నుంచి తప్పుకోవడానికి ఇదే కారణమా? అని కొందరు సందేహాస్పద ప్రశ్నలు వేస్తున్నారు. కానీ కమల్ హాసన్ తన సినిమాల కారణంగా షో నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: