ఇండియాలో మొదటగా బిగ్ బాస్ షో హిందీ లో ప్రారంభం అయింది. హిందీ లో మొదట ప్రారంభం అయిన ఈ షో కు ప్రేక్షకుల నుండి సూపర్ అద్భుతమైన రెస్పాన్స్ రావడం మొదలు అయింది. దానితో ఈ షో ను భారతదేశం లోని అనేక ప్రాంతీయ భాషలలో కూడా ప్రసారం చేయడం మొదలు పెట్టారు. అందులో భాగంగా తమిళ భాషలో కూడా చాలా రోజుల క్రితమే ఈ షో ను స్టార్ట్ చేశారు. ఇకపోతే కమల్ హాసన్ తమిళ బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు.

తమిళ నాడులో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడు కావడంతో ఈయన హోస్ట్ చేస్తూ రావడంతో ఈ షో కు మంచి రెస్పాన్స్ జనాల నుండి వచ్చింది. ఇకపోతే విక్రమ్ మూవీ వరకు వరుస పరాజయాలు ఉండడంతో కమల్ హాసన్ కూడా సినిమాలలో తక్కువగా నటిస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడు అయితే విక్రమ్ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో కమల్ రేంజ్ మరోసారి అద్భుతమైన స్థాయిలో పెరిగింది. దానితో ఆయన సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇక కమల్ హాసన్ "ఇండియన్ 3" మూవీ లో నటించబోతున్నాడు.

అలాగే మణిరత్నం దర్శకత్వంలో ఓ మూవీ లో నటిస్తున్నాడు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోయే తమిళ బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరించలేను అని కమల్ ప్రకటించాడు. దానితో తమిళ బిగ్ బాస్ నిర్వాహక బృందం కమల్ హాసన్ రేంజ్ లో హోస్ట్ చేయగలిగిన మరో వ్యక్తి కోసం ప్రయత్నాలను ఇప్పటి నుండే మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. మరి తమిళ బిగ్ బాస్ షో కు ఎవరు హోస్ట్ గా వ్యవహరిస్తారో ఆయన కమల్ హాసన్ రేంజ్ లో ఆడియన్స్ మెప్పిస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: