తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కావ్య దాపర్ ప్రస్తుతం కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఈమెకు పెద్దగా విజయాలు లేకపోయిన ఈమె నటించిన ప్రతి సినిమాలను తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రావడంతో ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన డబల్ ఇస్మార్ట్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

సినిమా ఆగస్టు 15 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ బ్యూటీ కూడా ఈ సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా పాల్గొంటుంది. అందులో భాగంగా డబల్ ఇస్మార్ట్ మూవీ లో అవకాశం ఎలా వచ్చింది. అలాగే ఈస్మార్ట్ శంకర్ మూవీ లో అవకాశం ఎందుకు రాలేదు అనే విషయాలను క్లియర్ గా తెలియజేసింది. నన్ను డబల్ ఈస్మార్ట్ మూవీ కి హీరోయిన్ గా అనుకున్నారు. ఇక ఆ సమయంలో నాకు చిన్న యాక్సిడెంట్ కావడం వల్ల నేను డైట్ ఫాలో కాలేదు. దాని వల్ల కాస్త బరువు ఎక్కువగా ఉన్నాను.

ఇక పూరి జగన్నాథ్ గారు బరువు తగ్గించు అని చెప్పారు. దానితో నేను డైట్ ఫాలో అయ్యి బరువు తక్కువ అయ్యాను. నన్ను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు అని చెప్పారు. ఇకపోతే ఈస్మార్ట్ శంకర్ మూవీ ఆడిషన్స్ కూడా నేను వెళ్లాను. కాకపోతే అప్పుడు నేను ఆ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ కాలేదు అని ఈ బ్యూటీ తెలియజేసింది. ఇకపోతే ఇప్పటికే డబల్ ఇస్మార్ట్ మూవీ నుండి ఇప్పటికే ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అందులో ఈమె తన అందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కనుక మంచి విజయం సాధిస్తే ఈ బ్యూటీ కి తెలుగులో మరిన్ని క్రేజీ సినిమాలో అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: