కొంత కాలం క్రితం కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు "లియో" అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. విజయ్ , త్రిష కాంబోలో అంతకు ముందు చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ మధ్య కాలంలో  వీరి కాంబోలో సినిమాలు రాలేదు. అలా చాలా సంవత్సరాల తర్వాత లోకేష్ కనకరాజు వీరి కాంబోలో సినిమాలు రిపీట్ చేశాడు. ఈ సినిమాలో విజయ్ , త్రిష ఇద్దరు కూడా భార్య భర్తల పాత్రలలో నటించారు.

మూవీ మంచి విజయం అందుకుంది. అలాగే ఈ సినిమాలో వీరిద్దరి జంటకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే లియో మూవీ కి లోకేష్ కనకరాజు అనుసరించిన పద్ధతినే సందీప్ రెడ్డి వంగ , ప్రభాస్ సినిమా విషయంలో ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది. రెబెల్ స్టార్ ప్రభాస్ మరి కొంత కాలంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందబోయే స్పిరిట్ అనే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే సందీప్ ఈ సినిమాకు సంబంధించిన దాదాపు ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష ను తీసుకోబోతున్నట్లు , ఈ సినిమాలో ప్రభాస్ , త్రిష ఇద్దరు కూడా భార్య భర్తల పాత్రలలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభాస్ , త్రిష గతంలో వర్షం , పౌర్ణమి అనే సినిమాలలో నటించారు. ఇక పౌర్ణమి సినిమా వచ్చే ఇప్పటికి 18 సంవత్సరాలు అవుతుంది. అలా చాలా సంవత్సరాల తర్వాత ఈ కాంబోను రిపీట్ చేయనున్నట్లు , ఇందులో ఇందులో ప్రభాస్ , త్రిష భార్యా భర్తలుగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా లోకేష్ ను ప్రభాస్ సినిమా విషయంలో సందీప్ ఫాలో కాబోతున్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: