సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో హీరో గా నటించాడు. ఇకపోతే మహేష్ బాబు కెరియర్ ప్రారంభం అయిన కొత్తలో ఆయనకు అందిన బ్లాక్ బస్టర్ సినిమాలలో మురారి మూవీ ఒకటి. ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించగా ... క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీమూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ ద్వారా మహేష్ కు మంచి గుర్తింపు లభించింది. 

అలాగే ఈ సినిమాలో తన అందాలతో , నటనతో ప్రేక్షకులను కట్టి పడేసిన సోనాలి బింద్రే కూడా ఈ సినిమాతో సూపర్ సాలిడ్ గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో లభించింది. ఆ సమయంలో అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 9 వ తేదీన మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల అయ్యి కూడా ఇప్పటికే చాలా రోజులే అవుతుంది. ఇకపోతే ఆగస్టు 9 వ తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్ లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు.

మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా ఈ మూవీ బృందం ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ సేల్స్ ద్వారానే 2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇలా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ను జనాల నుండి తెచ్చుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: