ఎక్కువ శాతం స్టార్ డైరెక్టర్లు కేవలం ఒకే సినిమాపై ఫోకస్ పెడుతూ ఉంటారు. ఒక సినిమా పనులు మొత్తం పూర్తి అయ్యి ఆ సినిమా విడుదల అయిన తర్వాతే మరో సినిమా గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ నీల్ మాత్రం ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను కూడా పూర్తి చేస్తూ ఉంటాడు. ఆయన అలా పూర్తి చేసి సినిమాలతో అద్భుతమైన విజయాలను కూడా అందుకుంటున్నాడు.

కే జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ తో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈయన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ ని తెరకెక్కిస్తూనే ప్రభాస్ తో సలార్ అనే మూవీ ని రూపొందించాడు. ఇక కే జి ఎఫ్ చాప్టర్ 2 సూపర్ సక్సెస్ అయ్యింది. సలార్ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ , ప్రభాస్ తో సలార్ 2 మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. అలాగే చాలా రోజుల క్రితమే ఎన్టీఆర్ హీరోగా ఓ మూవీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 9 వ తేదీన ఎన్టీఆర్ , ప్రశాంత్ కాంబోలో సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర పార్ట్ 1 , వార్ సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాల షూటింగ్ లు పూర్తి కాగానే ఎన్టీఆర్ , ప్రశాంత్ నిల్ కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ ఒక వైపు సలార్ పార్ట్ 2 మూవీ ని తెరకెక్కిస్తూనే మరో వైపు ఎన్టీఆర్ తో కూడా మూవీ ని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకే సారి రెండు మూవీ ల షూటింగ్లను ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: