త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే త్రిబుల్ ఆర్ వంటి బిగ్గెస్ట్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో దీనికోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ పాటలు సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నాయి. జరగండి అంటూ సాగే సాంగ్

 విడుదలైనప్పటి నుండి దీనిపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన కేవలం రెండు మూడు అప్డేట్స్ మాత్రమే బయట పెట్టడంతో ఈ విషయంలో కాస్త నిరుత్సాహంగా ఉన్నారు మెగా అభిమానులు. రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యి ఇప్పటికే మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆ రెండు అప్డేట్స్ మినహాయించి ఇప్పటివరకు ఏ ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు చిత్ర బృందం. కేవలం ఒక్క పాట విడుదల చేసి ఆగిపోయారు. దీంతో చిత్ర బృందంపై బాగా ఫైర్ అవుతున్నారు మెగా ఫాన్స్. ఇందులో

 భాగంగానే తాజాగా గేమ్ ఛేంజర్ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు తెలిపారు. నిర్మాత దిల్ రాజు పూజా కార్యక్రమాలతో ఈరోజు డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసినట్లు తెలిపారు. దీంతో అటు షూటింగ్ అయిపోవడం.. ఇటు డబ్బింగ్ వర్క్ షూరు చేయడంతో త్వరలోనే గేమ్ ఛేంజర్ ను నుంచి వరుస అప్డేట్స్ రావడం ఖాయమని ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. డబ్బింగ్ వర్క్ ఫోటోస్ షేర్ చేసిన మేకర్స్.. మరోసారి రిలీజ్ డేట్ పై స్పష్టతనిచ్చారు. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ఈ నెల చివరలో రిలీజ్ చేయనున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: