ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల విడాకులు, బ్రేకప్ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియా మొత్తంలో ఎక్కువగా వినిపిస్తున్న విడాకుల వార్తలు ఎవరివంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడాకులు మాత్రమే.అయితే గత కొద్ది రోజులుగా వీరి మది సఖ్యత లేదని తెలుస్తోంది.ఇక అభిషేక్ బచ్చన్ తో అంతా బాగానే ఉన్నప్పటికీ అభిషేక్ బచ్చన్ తల్లి జయాబచ్చన్ తో ఐశ్వర్యరాయ్ కి పొసగడం లేదని సమాచారం.అందుకే అత్తా కోడళ్ళకు చిచ్చు పుట్టడంతో భార్యాభర్తలు విడాకులు తీసుకోబోతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఐశ్వరరాయ్ అభిషేక్ బచ్చన్ ల విడాకులు వైరల్ అవుతున్న వేళ తాజాగా అభిషేక్ బచ్చన్ మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ అయ్యాయి.ఆమె వల్ల నా జీవితం నాశనం అయింది అంటూ ఆయన మాట్లాడిన మాటలు బీటౌన్ లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అభిషేక్ బచ్చన్ మాట్లాడింది ఐశ్వర్యారాయ్ తో విడాకుల గురించేనా ..

 ఇంతకీ ఆయన జీవితం నాశనం అయ్యింది అని అభిషేక్ బచ్చన్ ఎందుకు అలాంటి కామెంట్స్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. అభిషేక్ బచ్చన్ జీవితం నాశనమైంది అంటూ మాట్లాడింది ఐశ్వర్య రాయ్ ని ఉద్దేశించి కాదు. మరో హీరోయిన్ కరీనా కపూర్ ని ఉద్దేశించి.అయితే వీరిద్దరికి మధ్య రిలేషన్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. అభిషేక్ బచ్చన్, కరీనాకపూర్ మొదట ఇండస్ట్రీకి పరిచయమైంది రెఫ్యూజీ అనే మూవీతో. వీరిద్దరికీ ఇది మొదటి సినిమానే కావడంతో సినిమా హిట్ కోసం భారీ సన్నాహాలు చేశారు.ఎందుకంటే ఇద్దరు ఇండస్ట్రీలో ఉండే పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో కరీనా అభిషేక్ కి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలానే ఉన్నాయట.

కానీ ఆ టైంలో మీరు నాకు బ్రదర్ లాంటి వారు మీతో రొమాంటిక్ సన్నివేశాల్లో నేను ఎలా నటించగలను అంటూ అభిషేక్ బచ్చన్ హార్ట్ బ్రేక్ చేసిందట  కరీనా.అయితే సినిమా షూటింగ్ కోసం వీరిద్దరూ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించే సమయంలో ప్రతిసారి అభిషేక్ కి కరీనా అన్న మాటలే గుర్తుకు వచ్చి సరిగ్గా నటించకపోయేవారట.అయితే అప్పటి విషయాన్ని గుర్తు చేసుకున్న అభిషేక్ బచ్చన్ ఆమె వల్ల నా సినీ కెరియర్ నా నటన నాశనం అయ్యింది. ఆమె మాటలు నన్ను ఎంతగానో బాధించాయి.. అంటూ అభిషేక్ బచ్చన్ తన మొదటి సినిమా అనుభవాలను బయటపెట్టారు.దీంతో కరీనాకపూర్ చేసిన పనికి అభిషేక్ బచ్చన్ అంతలా ఇబ్బంది పడ్డారా అంటూ ఈ విషయం తెలిసిన నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇక కరీనాకపూర్ సోదరి కరిష్మా కపూర్ అభిషేక్ బచ్చన్ లు ప్రేమించుకున్నారనే సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాక కొన్ని కారణాలవల్ల విడిపోయారు

మరింత సమాచారం తెలుసుకోండి: