నాగబాబు కూతురు నిహారిక తాజాగా కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాను నిర్మించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మే 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాపై గట్టి నమ్మకం ఉన్న ఫిలిం మేకర్స్ ఆ సినిమాను విడుదలకు ఒక రోజు , లేదా అంత కన్నా కొన్ని రోజులు ముందే కొన్ని చోట్ల పెయిడ్ ప్రీమియర్ షో లను ప్రదర్శిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే నిహారిక కూడా ఆ ప్లాన్ ని వర్కౌట్ చేయబోతోంది. 

ఈ సినిమాను ఆగస్టు 9 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనుండగా అంతకు ఒక రోజు ముందు అనగా ఆగస్టు 8 వ తేదీనే ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ ను కొన్ని ప్రాంతాలలో ప్రదర్శించనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ ను వేస్తున్నారు. అలా పెయిడ్ ప్రీమియర్స్ వేసిన సినిమాలలో కొన్ని సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి.

ఇకపోతే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా గనక సినిమాకి మంచి టాక్ వచ్చినట్లు అయితే మొదటి రోజు ఆ మూవీ లకు భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక వేళ పెయిడ్ ప్రీమియర్స్ లోనే ఆ సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చినట్లు అయితే ఆ సినిమాకు మొదటి రోజు కూడా కలెక్షన్లు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. ఏదేమైనా నిహారిక మాత్రం కమిటీ కుర్రాళ్ళు సినిమాకి పెయిడ్ ప్రీమియర్స్ వేసి పెద్ద రిస్క్ చేస్తోంది.

మరి ఈ పెయిడ్ ప్రీమియర్స్ కి హిట్ టాక్ వస్తుందో ... ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఈ దర్శకుడు యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందించాడు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: