తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో చాలా సంవత్సరాల క్రితమే ప్రారంభం అయింది. తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ కి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఈ సీజన్ అద్భుతమైన విజయం సాధించింది. ఇక ఆ తర్వాత రెండవ సీజన్ కి నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఈ సీజన్ కు కూడా మంచి రెస్పాన్స్ తెలుగు ప్రేక్షకుల నుండి లభించింది. ఇక బిగ్ బాస్ తెలుగు మూడవ సీజన్ నుండి ఇప్పటి వరకు పూర్తి అయిన అన్ని సీజన్ లకి కూడా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు.

ఇప్పటి వరకు తెలుగు లో బిగ్ బాస్ షో బుల్లి తెర పై 7 సీజన్లను ,  ఓ టి టి లో ఒక సీజన్ ను కంప్లీట్ చేసుకుంది. కొంత కాలం క్రితమే బిగ్ బాస్ ఏడవ సీజన్ కంప్లీట్ అయింది. ఇందులో పల్లవి ప్రశాంత్ విజయం సాధించాడు. మరికొంత కాలం లోనే బిగ్ బాస్ 8 వ సీజన్ ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ 8 వ సీజన్ సెప్టెంబర్ 1 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షో 8 వ సీజన్ ప్రారంభ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ బృందం భారీ ప్లాను వేసినట్లు తెలుస్తోంది.

మొదటి ఎపిసోడ్ తోనే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెంచేందుకు గాను టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను ఈ షో మొదటి ఎపిసోడ్ కు గెస్ట్ గా తీసుకురావాలి అని బిగ్ బాస్ షో నిర్వాహక బృందం ప్లాన్లు వేస్తున్నట్లు , అందులో భాగంగా ఆయనను సంప్రదించడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 8 మొదటి ఎపిసోడ్ గెస్ట్ గా వస్తాడా లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: