మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తుంది. కెరియర్ ప్రారంభంలో చాలా వరకు కమర్షియల్ సినిమాలలో నటించి తన నటనతో కంటే కూడా అందాలతో ప్రేక్షకులను ఎక్కువగా కట్టి పడేసిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం వైవిధ్యమైన సినిమాలలో , లేడీ ఓరియంటెడ్ సినిమాలలో , వెబ్ సిరీస్ లలో నటిస్తూ తన అందాల కంటే కూడా నటనను ఎక్కువ ప్రదర్శించడానికి ఆసక్తిని చూపిస్తోంది.

అందులో భాగంగా ప్రస్తుతం ఈ నటి అనేక వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ హీరోగా డీకే దర్శకత్వంలో తెరకెక్కిన హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో అందుబాటులోకి రానుంది. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 27 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో అందుబాటు లోకి రాబోతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ వెబ్ సీరీస్ కి సంబంధించిన ట్రైలర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు.

ఈ సిరీస్ లో భారీ యాక్షన్ సీన్స్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సమంత కూడా ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ వెబ్ సిరీస్ కోసం సమంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ పుచ్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఒక్క వెబ్ సిరీస్ కోసమే ఈ బ్యూటీ ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా సమంత "హనీ బన్నీ" వెబ్ సిరీస్ కోసం అదిరిపోయే రేంజ్ లో పారితోషకం పుచ్చుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: