తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాతలలో అల్లు అరవింద్ ఒకరు. అల్లు అరవింద్ తన కుమారుడు అయినటువంటి అల్లు అర్జున్ ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అనుకున్న సమయంలో రాఘవేందర్రావు అయితే అందుకు బెస్ట్ ఆప్షన్ అనుకున్నాడు. ఇక రాఘవేందర్రావు దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా గంగోత్రి అనే సినిమాను మొదలు పెట్టారు. ఈ మూవీ కి చిన్ని కృష్ణ కథను అందించాడు. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు జరిగిన ఒక అనూహ్యమైన సంఘటన గురించి ఒక ఇంటర్వ్యూలో భాగంగా రాఘవేంద్రరావు గారు చెప్పుకొచ్చారు.

ఇంటర్వ్యూలో భాగంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ ... అల్లు అరవింద్ తన కొడుకును సినిమా ఇండస్ట్రీ లోకి లాంచ్ చేయాలి అనుకున్న సమయంలో నన్ను నమ్మి అల్లు అర్జున్ మొదటి సినిమా బాధ్యతలను నాకు అప్పగించాడు. ఇక నేను కూడా చిన్ని కృష్ణ అందించిన కథతో గంగోత్రి అనే సినిమాను తెరకెక్కించాను. ఆ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయింది. రీ రికార్డింగ్ పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. అలాంటి సమయంలో సినిమాను కొంత మంది చూశారు. చూసిన వారంతా ఈ సినిమా ఫ్లాప్ అని అన్నారు.

అలాగే ఈ సినిమా విడుదల అయితే బన్నీ కెరీర్ కూడా క్లోజ్ అన్నారు. అలాంటి సమయంలోనే అల్లు అరవింద్ కూడా ఈ సినిమా చూశాడు. చూసిన ఆయన ఈ సినిమా వేస్ట్ ... ఫ్లాప్ అవుతుంది. ఈ మూవీ ని ఇలాగే విడుదల చేస్తే బన్నీ కెరియర్ క్లోజ్. ఈ మూవీ ని తీసుకెళ్లి డస్ట్ బిన్ లో వేయడం మంచిది. కాకపోతే ఇది రాఘవేంద్రరావు గారి 100 వ సినిమా కాబట్టి దీన్ని విడుదల చేస్తాం అని అన్నాడట. ఇక ఆ తర్వాత రాఘవేందర్ రావు మళ్ళీ ఈ సినిమా కథను చెప్పి వారికి నమ్మకాన్ని కల్పించాడట. ఆ తర్వాత రీ రికార్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ విడుదల కాపడం అద్భుతమైన విజయం సాధించడం జరిగాయి అని రాఘవేంద్రరావు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: