మాస్ మహారాజా రవితేజ గోపీచంద్ మలినేని కాంబోలో మొదటగా డాన్ శీను అనే సినిమా రూపొందింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇక ఈ సినిమాతోనే గోపీచంద్ మలినేని దర్శకుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ తర్వాత వీరి కాంబోలో బలుపు అనే మరో కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబో లో క్రాక్ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంది. ఇలా వీరి కాంబో లో ఇప్పటి వరకు మూడు సినిమాలు తెరకెక్కగా ఆ మూడు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం రవితేజ హీరో గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ సంస్థ లో ఓ మూవీ అనౌన్స్ అయ్యింది. వీరి కాంబోలో ఈ సినిమా కూడా స్టార్ట్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ మూవీ కి భారీ బడ్జెట్ అయ్యే అవకాశం ఉంది అని , అంత బడ్జెట్ ఈ సినిమా ద్వారా వర్కౌట్ కావడం కష్టం అనే ఉద్దేశంతో నిర్మాతలు ఈ మూవీ విషయంలో వెనక్కు వెళ్లారు అని దానితో ఈ సినిమా క్యాన్సిల్ అయింది అని వార్తలు వచ్చాయి. ఈ మూవీ క్యాన్సిల్ కాగానే రవితేజ , హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని స్టార్ట్ చేశాడు. ఇప్పటికే ఆ మూవీ కి సంబంధించిన అన్ని పనులు పూర్తి అయ్యాయి.

మూవీ ఆగస్టు 15 వ తేదీన విడుదల కానుంది. ఇకపోతే గోపీచంద్ మలినేని మాత్రం రవితేజ తో సినిమా క్యాన్సల్ అయిన తర్వాత కొంత కాలం రెస్టు తీసుకున్నాడు. ఆ తర్వాత హిందీ నటుడు బాబి డియోల్ హీరో గా మైత్రి సంస్థలో ఓ మూవీ ని సెట్ చేసుకున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. రవితేజ , గోపీచంద్ కాంబోలో సినిమా క్యాన్సల్ అయిన తర్వాత రవితేజ సూపర్ స్పీడ్ గా ఒక సినిమా కంప్లీట్ చేస్తే , గోపీచంద్ మాత్రం కొన్ని రోజుల క్రితమే ఓ మూవీ ని స్టార్ట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: