నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 29న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో  నిర్మిస్తున్న ఈ సినిమా కమర్షియల్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ నేపథ్యంలో రాబోతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన పాటలు టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే నాని ప్రస్తుతం వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు.  సరిపోదా శనివారంతో నాని ఎటువంటి

 విజయాన్ని అందుకుంటాడో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే నాని కథల ఎంపికల విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. నాని నటిస్తున్న సరిపోదా శనివారం సినిమాలో sj సూర్య కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్ జె సూర్య ఒక  పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఎస్.జె.సూర్య ఓ ఇంటర్వ్యూలో ఈ

 మూవీ కథని కొంత వరకు రివీల్ చేసేసారు. చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉంటూ అన్నింటికి కోపాన్ని ప్రదర్శించే నానిని కంట్రోల్ చేయడానికి అతని తల్లి ఒక ఆలోచన చేస్తుంది.  వారం రోజులు వచ్చిన కోపాన్ని మనసులో దాచుకో… దానిని ఒక రోజు చూపించేసే అని సలహా ఇస్తుంది. నాని క్యారెక్టర్ తల్లి చెప్పిన ఆ మాటని మనసుకి తీసుకొని అలాగే చేయడం మొదలుపెడతాడు. అలా వారం రోజులు వచ్చిన కోపాన్ని శనివారం రోజు హీరో చూపించే ప్రయత్నం చేస్తాడని సూర్య సదరు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే సూర్య మూవీ స్టోరీ మొత్తం రివీల్ చేసాడని ఈ ఇంటర్వ్యూ వీడియోపై సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: