సినిమా విజయంలో అయిన , ఫెయిల్యూర్లో అయిన ఆ మూవీ యొక్క రన్ టైమ్ కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఒక సినిమా కథలో దమ్ము ఉండి ఆ సినిమాకు భారీ రన్ టైమ్ అవసరము ఉన్నప్పుడు ప్రేక్షకులు అలాంటి సినిమాలు మూడు గంటల కంటే ఎక్కువ రన్ టైమ్ తో ఉన్నా కానీ చూస్తూ ఉంటారు. అలా మూడు గంటల కంటే ఎక్కువ రన్ టైమ్ ఉండి కూడా బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు అనేకం ఉన్నాయి. ఇక కొన్ని సినిమాలు రెండు నిడివితో ఉన్న అందులో పెద్దగా కథ లేకపోవడం , వాటిని సాగదీయడం వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర అలాంటి సినిమాలు బోల్తా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానితో సినిమా కథకు ఎంత రన్ టైమ్ అవసరమో అంతే రన్ టైమ్ తో సినిమా ఉన్నట్లయితే ఆ మూవీ లలో గొప్ప కథ లేకపోయినా చూసే ఆడియన్స్ కు బోరు కొట్టకపోవడం వల్ల సినిమాలు కనీసం అలాంటి సినిమాలు యావరేజ్ విజయాన్ని అయినా అందుకునే అవకాశాలు ఉంటాయి.

ఇక ఈ మధ్య కాలంలో కొన్ని భారీ నిడివితో వచ్చిన సినిమాలకు మొదటి రోజే నెగటివ్ టాక్ రావడంతో వాటి రన్ టైమ్ ను తగ్గించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితం నాని హీరోగా నజ్రియా నజీమ్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి మూవీ రూపొందింది. ఈ సినిమా దాదాపు మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అంతా బాగానే ఉన్నా రన్ టైమ్ విషయంలోనే కాస్త నెగటివ్ టాకు వచ్చింది. ఇక చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయం సాధించింది.

తాజాగా నాని హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే మూవీ రూపొందింది. ఈ మూవీ ఆగస్టు 29 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమా రన్ టైమ్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని 2 గంటల 35 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ బృందం ఈ సినిమాను అంటే సుందరానికి మూవీల కాకుండా తక్కువ రన్ టైమ్ తోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: