ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కలిసి చేయబోతున్న చిత్రం గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూజా కార్యక్రమం త్వరలోనే జరగనుంది. అంటే ప్రభాస్, హను కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాకు శ్రీకారం చాపేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. అది ఏంటంటే

 
మేకర్స్ ఈ చిత్రానికి ముహూర్తం డేట్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో ఈ సినిమా ఈ ఆగస్టు 17న ముహూర్త కార్యక్రమాలతో మొదలు కానుందట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి “ఫౌజి” అనే టైటిల్ ని ఫిక్స్ చేయగా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. కథ, నటీనటులు, టెక్నీషియన్స్ విషయంలో పలు పేర్లు వినిపించాయి. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో అభిమానులు కంఫర్మ్


 అవ్వలేకపోతున్నారు. ఇక మేకర్స్ ఈ సినిమా పై కొంచం క్లారిటీ ఎవడం తో అభిమానులకి ఈ సినిమాపై కాస్త క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు ప్రభాస్ ప్రస్తుతం "ది రాజా సాబ్" చిత్రంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత హను దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. హను కూడా తన తదుపరి చిత్రానికి ప్రభాస్‌ని ఎంచుకోవడం విశేషం. ఇక ప్రభాస్ కెరీర్ లో ఈ సినిమా ఎలాంటి మలుపు తిప్పబోతుందో అనే ఆసక్తి నెలకొంది. హను దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీకారం’, ‘భానుమతి రాముడు’ చిత్రాలు మంచి విజయం సాధించాయి. కాబట్టి ఈ కాంబినేషన్ నుంచి ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: