టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ సినిమా ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ బాట పడుతున్నాయి. అయినప్పటికీ తన క్రేజ్ మాత్రం అసలు తగ్గడం లేదు. ఇక పూరి జగన్నాథ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగార్

 సినిమా ఎంతటి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారిందో మీ అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఖుషీ ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపును సంపాదించుకోలేకపోయాడు.  ఈ సినిమాలు ఓకే ఓకే అనిపించుకున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఆశలు అన్ని గౌతం తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత విజయ్ VD 14 వ సినిమాను రాహుల్ సంకృత్యాన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్నాడు.

 పీరియాడికల్ జానర్‌లో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ ఉండబోతుంది. ఈ సినిమాలో విజయ్ కి జోడిగా రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత రవికిరణ్ కోలా దర్శకత్వంలో VD15 మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. పుష్ప 2 తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా అయితే ప్లాన్ చేస్తున్నాడు. ఇక యానిమల్ సినిమా దర్శకుడు మరోసారి విజయ్‌తోనే అర్జున్ రెడ్డి + యానిమల్ రేంజ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.  ఇలా గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. .!!

మరింత సమాచారం తెలుసుకోండి: