గత కొద్ది రోజులుగా మెగా, అల్లు కుటుంబం మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది.అయితే ఈ కోల్డ్ వార్ నిజమే అన్నట్లుగా 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి కాకుండా అల్లు అర్జున్ తన స్నేహితుడికి ప్రచారం చేశారు. దాంతో వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. అయితే టైం చూసి కొట్టినట్టు పవన్ కళ్యాణ్ తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి ని,  అటవీ శాఖ మంత్రి ని కలిసి ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు వంటి ప్రాంతాలలో ఏనుగులు పంట పొలాలను నాశనం చేస్తున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి కి వివరించి వీటిని అదుపు చేయడం కోసం మీ రాష్ట్రంలోని కుంకి ఏనుగులను పంపిస్తే పంట పొలాలను రక్షించిన వారం అవుతామని కోరారు. దానికి కర్ణాటక ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించింది. అలాగే ఎర్రచందనం చెట్ల నరికివేత,స్మగ్లింగ్ వంటి వాటిని కట్టడి చేయాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి అడవుల గురించి మాట్లాడుతూ.. ఓ 40 ఏళ్ల క్రితం సినిమా హీరోలందరూ అడవుల్ని రక్షించాలని చెప్పేవారు. కానీ ఇప్పటి హీరోలు మాత్రం చెట్లను నరికేసి, స్మగ్లింగ్ చేసే పాత్రలు పోషిస్తున్నారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ నోటి నుండి ఆ మాట రావడంతోనే అల్లు అర్జున్ అభిమానులు అందరూ బన్నీనే పవన్ టార్గెట్ చేశారని, ఆయన రీసెంట్గా పుష్ప సినిమాలో ఎర్రచందనం చెట్లను నరికివేసి స్మగ్లింగ్  చేసే పాత్రలో పోషించారు.

అందుకే ఆయనని ఉద్దేశించి కామెంట్స్ చేశారు అంటూ బన్నీ అభిమానులు తో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ బన్నీ మీద ఉన్న కోపాన్ని టైం చూసి కొట్టాడు.మరికొద్ది నెలల్లో పుష్ప-2 విడుదల అవుతున్న నేపథ్యంలో అడవులు, స్మగ్లింగ్ అంటూ పవన్ మాట్లాడిన మాటలు బన్నీ సినిమాకి పెద్ద నష్టం తెచ్చి పెడతాయి అంటూ మాట్లాడుకుంటున్నారు.కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం పవన్ బన్నీ ని టార్గెట్ చేయలేదని, ఆయన అడవి శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడారని అంటున్నారు. ఎందుకంటే పవన్ టార్గెట్ చేయాలంటే బన్నీని ఎప్పుడో టార్గెట్ చేసేవారు. కానీ అలాంటి మనస్తత్వం ఆయనది కాదు. కుటుంబాన్ని టార్గెట్ చేసే వ్యక్తి ఆయన కాదు అని అంటున్నారు. అంతేకాకుండా ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా ద్వారా పిఠాపురంలో గెలిపించండి అని బన్నీ ఓ చిన్న పోస్ట్ పెట్టారు. కానీ తన స్నేహితుడు కోసం నంద్యాల వెళ్లి ప్రచారం చేశారు.ఇక ఈ విషయంలో మీడియా వాళ్ళు అడగగా నా ప్రాణ స్నేహితుడు కాబట్టి అడగకుండానే వచ్చి ప్రచారం చేశాను అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గురించి మీడియా వాళ్ళు అడిగితే పవన్ కళ్యాణ్ నన్ను ప్రచారం చేయమని అడగలేదు అందుకే రాలేదు అన్నారు. ఇక ఈ విషయంలో స్నేహితుడికి అడగకపోయినా ప్రచారం చేస్తారు కానీ కుటుంబ సభ్యులకు మాత్రం అడిగితేనే ప్రచారం చేస్తారా అని అల్లుఅర్జున్ ని విమర్శించారు.. ఇక బన్నీ ప్రతి ఈవెంట్లో నేను చిరంజీవి వల్లే ఇంత పెద్ద స్టార్ అయ్యాను.

పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ అంటూ మాట్లాడారు.కానీ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మాత్రం ఆయన మద్దతుగా నిలబడలేదు. ఇక పవన్ కోసం చాలామంది జబర్దస్త్ ఆర్టిస్టులు, మెగా ఫ్యామిలీ లోని కుటుంబ సభ్యులందరూ బయటికి వచ్చి ఎర్రటి ఎండలో ప్రచారం చేశారు. వారికి ఉన్న బాధ్యత అల్లు అర్జున్ కి లేదా అని కొంతమంది బన్నీని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఒకే ఒక పాన్ ఇండియా మూవీతో అల్లు అర్జున్ ఫ్యామిలీని సైతం పట్టించుకోకుండా నేను ఇంత స్టార్ అవ్వడానికి ఎవరూ కారణం కాదు నేనే ఈ స్థాయికి చేరుకున్నాను అనేలా అహంకార ధోరణి అల్లు అర్జున్ లో పెరిగిపోయింది అని సినీ ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ స్థాయికి వచ్చాక అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి వెన్నుపోటు పొడుస్తున్నారని,ఎందుకు అల్లు అర్జున్ నడవడిక ఇలా మారిపోయిందని సినీ ఇండస్ట్రీలో కొంతమంది గుసగుసలు పెట్టుకుంటున్నారు.ఇక అల్లు అర్జున్ చేసిన పని కి పుష్ప-2 ని తెరకెక్కించే మేకర్స్ కూడా అయోమయంలో పడిపోయారు.. పుష్ప కి నెగటివ్ టాక్ కూడా వచ్చేసింది.అంతేకాదు మన ఎదుగుదలకి తోడ్పడిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదని, ఆకలి అన్నప్పుడు అన్నం పెట్టిన వారిని జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి అని అల్లు అర్జున్ ని మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.ఇక ఎంతో సౌమ్యంగా ఉండే పవన్ కళ్యాణ్ కే కోపం వచ్చేలా చేశారు అంటే బన్నీ ప్రవర్తన ఎలా మారిపోయిందో అర్ధం చేసుకోవచ్చు అని కామెంట్లు పెడుతున్నారు. మరి ఇప్పటికైనా అల్లు అర్జున్ తగ్గి ఇద్దరి మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు అని క్లారిటీ ఇస్తారా.. లేక అదే అహంకార ధోరణితో ముందుకు వెళ్తారా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: