అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ నిన్న కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. అయితే ఈ వేడుకకి అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు అది తక్కువమంది సన్నిహితులు మాత్రమే వచ్చారు. ఇక సడన్ గా వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ విషయం బయట పెట్టడంతో సమంతా అభిమానులు షాక్ అయ్యారు. అక్కినేని నాగార్జున ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియా ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించారు. దీంతో అక్కినేని అభిమానులు చైతూ, శోభిత జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అక్కినేని ఇంట, నెట్టింట చైతూ, శోభితల నిశ్చితార్థ వేడుక సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నారు.

 శోభితా ధూళిపాళతో గురువారం ఉదయం నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరగడంతో అందరూ హ్యాపీ! ఆ సంతోషం మీద నీళ్లు చల్లుతూ ఫేమస్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి బాంబు పేల్చారు. కొత్త జంటను అప్పుడే టార్గెట్ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో వేణు స్వామి గురించి తెలియని వారు ఉండరు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ బాగా పాపులర్ అయ్యారు. నిజానికి వేణు స్వామి పాపులర్ అయ్యిందే నాగ చైతన్య-సమంతల వివాహం. ఆ సమయంలో వేణు స్వామి చేసిన కామెంట్స్ వల్లే ఆయన ఇంత పాపులారిటీ మూటగట్టుకున్నారు. సమంత, నాగ చైతన్యల విషయంలో తాను చెప్పినట్టే జరిగిందని క్రెడిట్ తన అకౌంట్ లో వేసుకున్నారు.

 ఇలా కొన్ని విషయాల్లో వేణు స్వామి చెప్పినవి జరగ్గా కొన్ని విషయాల్లో జరగలేదు.  ఇకపోతే నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు. ఉంగరాలు ఇలా మార్చుకున్నారో? లేదో? వేణు స్వామి అలా ఊడి పడ్డారు. వాళ్లిద్దరి మ్యారీడ్ లైఫ్ గురించి చెబుతానని తెలిపారు.  ''నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వైవాహిక జీవితం మీద సంచలనాత్మకమైన జాతక పరమైన విశ్లేషణ రేపు'' - ఇదీ వేణు స్వామి తన ఇన్స్టాగ్రామ్ అకౌంటులో షేర్ చేసిన స్టోరీ. అది చూసిన కొందరు కాబోయే కొత్త జంటను ఆయన అప్పుడే టార్గెట్ చేశారని కామెంట్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: