టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన పేరులోనే వైబ్రేషన్ ఉంది. ఆయన పేరుకు ఓ రేంజ్ ఉంది. మహేష్ బాబు కటౌట్ కున్న క్రేజ్ అంతా ఇంత కాదు. హాలీవుడ్ హీరోలకి ఏమాత్రం తీసిపోని ధీటైనా హీరో అని గర్వంగా చెప్పుకోవచ్చు. నేడు సూపర్ స్టార్ పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలలతో సోషల్ మీడియా అంతా నిండిపోయింది. మహేష్ బాబు ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాడు. మంచితనంలోనూ, నటనలోనూ, రికార్డ్స్ సృష్టించడంలోనూ అంతకు మించి లక్షలాది అభిమానులని సొంతం చేసుకోవడంలోనూ తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణకి తగ్గ తనయుడు అన్నదానికి నిదర్శనం మహేష్ బాబు. టాలీవుడ్ ఆల్ టైం సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ బాబు తన తండ్రి లాగానే లక్షల అభిమానులని సంపాదించుకొని ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తక్కువ సమయంలోనే పెద్ద స్టార్ హీరోగా ఎదిగాడు. ఎన్నో మంచి పనులు చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు.మహేష్ ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా చాలా సింపుల్ గా ఉంటారు. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ ఉంటాడు. తన సంపాదనలో కొంత చిన్న పిల్లల కోసం ఖర్చు చేస్తుంటారు. నేడు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆకాశాన్ని తాకేలా సంబరాలు జరుపుకుంటున్నారు. 


ఇప్పటికే నెల రోజుల ముందు నుంచి మహేష్ బాబు అభిమానులు తెగ సందడి చేస్తున్నారు.సూపర్ స్టార్ అయినా, ఆయన బర్త్ డే అయినా ఫ్యాన్స్ కు పెద్ద పండగ అనే చెప్పాలి. ఎక్కడ చూసిన కుప్పలు కుప్పలుగా ఫ్యాన్స్ ఉంటారు. అందువల్ల ఎక్కడ చూసిన జాతర వాతావరణం కనిపిస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ .. విదేశాల్లోనూ మహేష్ బాబుకి భారీ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. నేడు సంబరాలు చేసుకుంటున్నారు. మహేష్ కొటౌట్స్ కు పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, రక్తదానాలు, అన్నదానాలు అంటూ తమ హీరో పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇప్పుడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఫోటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. మహేష్ కేవలం సినీ హీరోనే కాదు మంచి మనసున్న రియల్ హీరో. ఎలాంటి రాజకీయాల్లోకి రాకుండా తన సొంత డబ్బుతో ఇప్పటికే వేల చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించాడు. ఎన్నో వేల చిన్నారుల గుండె చప్పుడు మా మహేష్ బాబు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: