ఆమె మాట్లాడుతూ 'పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర చుట్టూ ఈ కథను రాసుకున్నాడు దర్శకుడు. మూడు తరాలను చూపించేలా ఈ కథ ఉంటుంది. వంశీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ లు కూడా ఇందులో ఉన్నాయి. వంశీ స్వతహాగా పవన్ కళ్యాణ్ కు అభిమాని. 2019 ఎన్నికల ప్రచార టైంలో జరిగిన విషయాలను కూడా ఇందులో తన స్ట్రైల్లో, కాస్త సెటైరికల్ గా చూపించారు. ఈ కథ విన్నప్పుడు పదకొండు మంది అబ్బాయిల క్యారెక్టర్లు నన్ను నేను ఊహించుకున్నాను. సినిమాను చూసే ప్రతి ఆడియెన్ ఏదో ఒక క్యారెక్టర్ తో ట్రావెల్ చేశారు. ప్రతి ఒక్కరూ సినిమాకు కనెక్ట్ అవుతారు. మా కమిటీ కుర్రోళ్ళు అందరి మనసు గెలుచుకుంటారనే నమ్మకం ఉంది.
ఇటీవల అన్న వరుణ్, వదిన లావణ్య సినిమాను చూశారు. వాళ్లకి సినిమా చాలా నచ్చింది..మా అన్న ఎప్పుడూ స్ట్రెయిట్ ఫార్వార్డగా చెప్పేస్తుంటారు. ఈ మూవీ చూసి వెంటనే నన్ను పిలిచి అభినందించారు. నటిగా మంచి కథలు, కాన్సెప్ట్ లు, స్క్రప్టేలకు నా ప్రాధాన్యం ఇస్తా. పాత్ర బాగుంటే మిగతా అంశాల గురించి అంతగా పట్టించుకోను. చిన్న పాత్ర అని, చిన్న హీరో అని కూడా ఆలోచించను. కథ బాగుంది..పాత్ర నచ్చితే సినిమాలో నటిస్తాను' అన్నారు. అలాగే వారసత్వం గురించి మాట్లాడుతూ..'వారసత్వం ఉంది కదా అని సినిమాలోకి వస్తే సెక్స్ స్ అవ్వలేరు.