చాలా మంది హీరోలు ఒక దర్శకుడి పై నమ్మకంతో కథ పూర్తిగా సిద్ధంగా లేకపోయినా సినిమాలను ఓకే చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా ఓకే చేసిన తర్వాత సినిమా స్టార్ట్ కావడం , సినిమా స్టార్ట్ అయిన కొంత కాలానికి ఆ సినిమా ఏదో తేడా కొడుతుంది మూవీ పోతుంది అని తెలిసినా కూడా ఇచ్చిన మాట కోసం సినిమా చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో మహేష్ బాబు కూడా ఒకరు. మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్ అడ్డాల "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" మూవీ ని తెరకెక్కించిన విధానానికి మహేష్ చాలా ఫిదా అయ్యాడు అంట. దానితో ఆయన ఒక సారి మీతో బ్రహ్మోత్సవం సినిమా చేయాలి అని ఉన్నట్లు ఒక లైన్ వినిపించాడట. దానితో మహేష్ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాను అద్భుతంగా డీల్ చేశాడు. బ్రహ్మోత్సవం సినిమాను కూడా సూపర్ గా డీల్ చేస్తాడు అనే నమ్మకంతో ఆయన దర్శకత్వంలో మరో మూవీ.కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక సినిమా మొదలు అయింది.

ఆ తర్వాత కొంత కాలానికే మహేష్ కు ఏ సినిమా సక్సెస్ కావడం కష్టమే అని అనిపించిందట. కాకపోతే శ్రీకాంత్ అడ్డాల పై ఉన్న గౌరవంతో , నిర్మాతలు అప్పటికే చాలా డబ్బును ఖర్చు పెట్టడంతో సినిమా పూర్తి చేశాడట. కాకపోతే సినిమా విడుదల తర్వాత మహేష్ అనుకున్న లాంటి రిజల్ట్ రావడం జరిగినట్లు తెలుస్తుంది. ఏదేమైనా మహేష్ బాబు మాత్రం శ్రీకాంత్ అడ్డాల పై నమ్మకంతో అలాగే ఆయన సినిమాను అద్భుతంగా డీల్ చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ తో బ్రహ్మోత్సవం అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కాకపోతే ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: