ఒక్కో దర్శకునికి ఒక్కో స్టైల్ ఉంటుంది. కొంత మంది దర్శకులు యాక్షన్ సినిమాలను అద్భుతంగా తీస్తే , మరి కొంత మంది దర్శకులు కుటుంబ కథా చిత్రాలను అద్భుతంగా తెరకెక్కిస్తారు. మరి కొంత మంది కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో ఆరితేరిపోయి ఉంటే , మరి కొంత మంది ప్రేమ కథ చిత్రాలను వెండి తేరపై ఆవిష్కరించడంలో సూపర్ గా సక్సెస్ అవుతారు. ఇకపోతే కొన్ని సందర్భాలలో కొంత మంది దర్శకులను మరి కొంత మంది ఫాలో కావడం కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో జనతా గ్యారేజ్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా సమంత మరియు నిత్యా మీనన్ హీరోయిన్ లుగా నటించారు. సమంత ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించగా ... నిత్యా మీనన్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. దాదాపు ఇలాంటి సంఘటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన మరో సినిమాలో కూడా జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సన్నాఫ్ సత్యమూర్తి అనే మూవీ రూపొందింది.

మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో కూడా సమంత , నిత్యా మీనన్ హీరోయిన్ లుగా నటించారు. సమంత ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించగా నిత్యా మీనన్ రెండవ హీరోయిన్ గా నటించింది. ఇలా జనతా గ్యారేజ్ సినిమాలో సమంత , నిత్యా మీనన్ హీరోయిన్ లుగా నటించగా ... సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా వీరిద్దరే హీరోయిన్లుగా నటించారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఈ మూవీ ల ద్వారా సమంత , నిత్యా మీనన్ కి కూడా మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: