విక్టరీ వెంకటేష్ హీరోగా కత్రినా కైఫ్ హీరోయిన్ గా విజయ్ భాస్కర్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం మల్లీశ్వరి అనే ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ , స్క్రీన్ ప్లే , మాటలు అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమా దర్శకుడు అయినటువంటి విజయ్ భాస్కర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

అందులో భాగంగా మల్లీశ్వరి మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ... మల్లీశ్వరి సినిమా ఒక అద్భుతమైన మూవీ. ఆ మూవీ ని సురేష్ బాబు నిర్మించారు. సురేష్ బాబు కూడా ఆ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీ అయ్యారు. ఆ సినిమాలో కత్రినా కైఫ్ ఒక మహారాణి. ఇక ఆమె ఉండే ఇల్లు కూడా అదే స్థాయిలో ఉండాలి అని ఒక పెద్ద ప్యాలెస్ ను సురేష్ బాబు గారు ఈ సినిమా కోసం తీసుకున్నారు. ఆ ప్యాలెస్ లో వెంకటేష్ , బ్రహ్మానందం గారి మధ్య ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశంలో వీరిద్దరూ ప్యాలెస్ లో నడుచుకుంటూ వెళ్లి డైనింగ్ హాల్ వద్దకు వెళతారు.

అక్కడ వెంకటేష్ భోజనం చేస్తారు. ఆ డైనింగ్ హాల్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఇకపోతే అంత పెద్ద ప్యాలెస్ లో కూడా అంత పెద్ద డైనింగ్ హాల్ లేదు. ఆ సన్నివేశం కోసం సురేష్ బాబు గారు ప్రత్యేకంగా కేర్ తీసుకొని అంత పెద్ద డైనింగ్ హాల్ ను తయారు చేపించారు. ఇక ఆ సన్నివేశం కూడా సూపర్ సక్సెస్ అయ్యింది అని విజయ్ భాస్కర్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా తెలియజేశాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ ప్రిన్సెస్ కావడం వల్ల అలాంటి లుక్ ఉండే అమ్మాయి కోసం చాలా మంది హీరోయిన్స్ ను వెతికి చివరగా కత్రినా కైఫ్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు ఈ దర్శకుడు తాజా ఇంటర్వ్యూలో భాగంగా తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vb