దీనిపై గురువారం బొగ్గారపు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. కార్తికేయ మొదటిభాగం విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబరులో విజయదశమి పర్వదినాన కార్తికేయ-3ను అధికారికంగా ప్రకటిస్తాను అంటున్నారు. కార్తికేయ-2 సంచలన విజయం సాధించడంతో వచ్చే ప్రీక్వెల్‌పై అంచనాలు ఎక్కువగా ఉంటాయని, అందుకే వారి అంచనాలకు అందుకునేటట్లుగా కథ విషయంలో, స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, దీంతో పాటు తను డివోషనల్ టచ్ వున్న ఓ కథతో హనుమంతుడి ప్రేరణతో యతి అనే సినిమాను, శివుడి స్పూర్తితో మహాయోగి అనే మరో డివోషనల్ థ్రిల్లర్‌ను నిర్మిస్తున్నానని ఆయన తెలిపారు. అయితే ఈ నిర్మాత ఇచ్చిన ఈ ప్రకటనతో హీరో నిఖిల్, దర్శకుడు, చందు మొండేటి, కార్తికేయ-2 నిర్మించిన నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.ప్రస్తుతం కార్తికేయ 3 చిత్రానికి స్క్రిప్ట్ పనుల్లో చందూ మొండేటి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‍గా, ఎక్కువ బడ్జెట్‍తో రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. రెండో భాగం పాన్ ఇండియా రేంజ్‍లో హిట్ అవడంతో కార్తికేయ 3 మూవీని భారీగానే తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. నాగచైతన్య హీరోగా తండేల్ చిత్రాన్ని ప్రస్తుతం రూపొందిస్తున్నారు చందూ మొండేటి.స్వయంభూ సినిమాలో ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ అంచనాలను భారీగా పెంచేసింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రాజుల కాలం నాటి కథతో ఈ చిత్రం రూపొందుతోంది. భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాదే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు.