మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో హీరోగా నటించి అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఆఖరుగా సాయి ధరమ్ తేజ్ , కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే సాయి ధరమ్ తేజ్ తన కెరియర్లో ఒకానొక సమయంలో చిరంజీవి వల్ల ఒక అద్భుతమైన బ్లాక్ బాస్టర్ మూవీ ని మిస్ చేసుకున్నాడు. అసలు ఆ కథ ఏంటి ... సాయి ధరమ్ తేజ్ చిరంజీవి వల్ల ఎలా బ్లాక్ బస్టర్ మూవీ ని మిస్ చేసుకున్నాడు అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం శర్వానంద్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు "శతమానం భవతి" అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమాను మొదట నిర్మాత దిల్ రాజు , శర్వానంద్ తో కాకుండా సాయి ధరమ్ తేజ్ తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనకు ఆ కథను కూడా వినిపించాడట. ఈ కథ సాయి తేజ్ కి బాగా నచ్చడంతో ఆయన కూడా ఈ సినిమా చేస్తాను అని కూడా చెప్పాడట.

కాకపోతే దిల్ రాజు ఈ సినిమాను కచ్చితంగా సంక్రాంతి పండుగకు విడుదల చేయాలి అనుకున్నాడట. ఇక సాయి ధరమ్ తేజ్ ఆ సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉండడం , అలాగే ఆ సంక్రాంతి కి చిరంజీవి హీరోగా రూపొందిన ఖైదీ నెంబర్ 150 సినిమా కూడా రిలీజ్ కు రెడీగా ఉండడంతో చిరంజీవి గారికి పోటీగా నువ్వు సినిమా చేసిన విడుదల చేయడం కష్టం అవుతుంది. అందుకే ఈ సినిమా నీకంటే శర్వానంద్ తో తీస్తేనే బెటర్ అని సాయి తేజ్ కి  దిల్ రాజు చెప్పాడట. దానికి ఆయన కూడా ఓకే సార్ అన్నాడట. అలా చిరంజీవి సినిమా సంక్రాంతి కి విడుదల ఉండడంతో శతమానం భవతి సినిమా సాయి తేజ్ నుండి మిస్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: