ఆ సినిమాలో కళావతి పాత్రలో అమ్మడు తన గ్లామర్ తో కూడా మెప్పించే ప్రయత్నం చేసింది. నేడు మహేష్ పుట్టినరోజు అవ్వడం వల్ల మన మహేస్ గారికి విషెష్ చెబుతూ నేను పనిచేసిన వరిలో అమేంజింగ్ పర్సనాలిటీ అంటూ మీ నుంచి రాబోయే అన్ని సినిమాలు బాగుండాలని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు ఈ స్పెషల్ రోజు మీకు ఎన్నో ప్రేమ పూర్వక శుభాకాంక్షలు అని పెట్టింది.
ఫైనల్ గా మీ కలవతిని అప్పుడప్పుడు గుర్తు పెట్టుకోండి అంటూ చివర్లో మహి అని పెట్టేసింది. మహేష్ తో నటించిన సర్కారు వారి పాట సినిమా పాత్ర తరహాలోనే సూపర్ స్టార్ కి చిలిపి మెసేజ్ చేసింది కీర్తి సురేష్. మహేష్ తో ఆమె నటించిన సర్కారు వారి పాట కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా ఆ ఇద్దరి జోడీ మాత్రం అలరించింది. మహేష్ తో మళ్లోసారి నటించాలనే రిక్వెస్ట్ తోనే కీర్తి సురేష్ అలా గుర్తు పెట్టుకోండి అనే మెసేజ్ పెట్టిందని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో సినిమా ప్లానింగ్ లో ఉంది. నేడు ఈ సినిమా అనౌన్స్ మెంట్ వస్తుందని అనుకోగా ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.