ముఖ్యంగా నందమూరి హరికృష్ణ మరణం తర్వాత అటు బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దూరం బాగా పెరిగిపోయిందని సమాచారం.. కళ్యాణ్ రామ్ చివరిగా నటించిన డెవిల్ సినిమాని డైరెక్టర్ అభిషేక్ నామా దర్శకత్వం వహించారు.. వాస్తవానికి ఈ చిత్రాన్ని వేరే డైరెక్టర్ సినిమా పూర్తి అయిన తర్వాత ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా, కళ్యాణ్ రామ్ కి ఆ డైరెక్టర్ తో విభేదాలు రావడంతో పాత డైరెక్టర్ పేరుకి బదులు అభిషేక్ నమా పేరును వేసుకోవడం జరిగింది. అయితే డెవిల్ సినిమాకి ఫ్రీ రిలీజ్ ముందు బాలయ్యను గెస్ట్ గా పిలుద్దామని అభిషేక్, కళ్యాణ్ రామ్ తో అన్నారట.
దీనిపైన కళ్యాణ్ రామ్ ఒక్కసారిగా ఫైర్ అయ్యి.. ఇలాంటి సమయంలో తన బాబాయిని పిలవాల్సిన అవసరం లేదని పిలిచినా కూడా రాడని కూడా తెలిపారట. అతడిని పిలవాలనే ఆలోచన కూడా తీసేయండి అని డైరెక్టర్ అభిషేక్ నామా తో చెప్పినట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్ కథానాయకుడు మహా నాయకుడు వంటి సినిమాలు తీస్తున్న సమయంలో నందమూరి కుటుంబం మధ్య బంధాలు బాగానే ఉన్నాయి. కానీ ఆ తర్వాత నెమ్మది వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. వీటికి తోడు చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసిన సమయంలో అటు కళ్యాణ్ రామ్, తారకరత్న ఎవరూ కూడా స్పందించలేదు. ఈ విషయంతో ఇప్పుడు బాలయ్య 50 ఏళ్ల సినీ వేడుకకు కూడా వీరిని పిలవలేదని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.