ఇండియన్ క్రికెట్ టీమ్ లో అత్యంత క్రేజ్ కలిగిన ఆల్ రౌండర్ ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా ఒకరు. ఈయన ఇండియా క్రికెట్ టీమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలం లోనే అద్భుతమైన ప్రదర్శనను కనబరచడంతో ప్రపంచ వ్యాప్తంగా గొప్ప క్రికెటర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇక క్రికెటర్ గా అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సమయం లో హార్థిక్ పాండ్యా , నటాషా స్టాంకోవిచ్ తో   ప్రేమలో పడ్డాడు. ఇక నటాషా కూడా ఈయనను ప్రేమించడం మొదలు పెట్టింది.

ఆ తర్వాత కొంత కాలం పాటు ప్రేమించుకొని ఒకరి నొకరు అర్థం చేసుకున్న వీరిద్దరూ 2023 వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో హిందూ మరియు క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఇక ఈ ఇద్దరు దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే పెళ్లి తర్వాత వీరి బంధం ఎక్కువ రోజులు సాగలేదు. వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ 2024 జులై నెలలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. నటాషా స్టాంకోవిచ్ 17 ఏళ్ల వయసులోనే మాడలింగ్ రంగం లోకి ఎంట్రీ ఇచ్చింది.

2013.లో సత్యగ్రహం సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2014 లో ఈమె బిగ్ బాస్ 8 లో పాల్గొంది. ఈ షో ద్వారా ఈమెకు బుల్లి తెర అభిమానుల నుండి కూడా గుర్తింపు లభించింది. ఇకపోతే నటాషా , హార్థిక్ పాండ్యా నుండి విడాకులు తీసుకున్న తర్వాత సెర్బియాలోని తన స్వగ్రామానికి తిరిగి వెళ్ళిపోయింది. ఇక ఈమె ప్రస్తుతం తన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. వాటికి మంచి రెస్పాన్స్ కూడా జనాల నుండి లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: