సినిమా ఇండస్ట్రీలో హాట్ కాంబినేషన్లకు అద్భుతమైన క్రేజ్ ఉంటుంది. ఒక హీరో , ఒక దర్శకుడి కాంబినేషన్లో మొదటగా వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది అంటే ఆ ఇద్దరి కాంబోలో మరో సినిమా రావాలి అని సినీ ప్రేమికులతో పాటు ఆ హీరో ఫ్యాన్స్ కూడా కోరుకుంటూ ఉంటారు. కాకపోతే అలాంటి హిట్ కాంబోలో ఒక సినిమా రిపీట్ అవుతూ ఉంటే అభిమానులు మాత్రం ఆ మూవీ ని వద్దు అనే పరిస్థితులు కనబడుతున్నాయి. అసలు ఆ సినిమా ఏది ..? అంత బ్లాక్ బస్టర్ కాంబో మూవీని ప్రేక్షకులు వద్దనడానికి అసలు కారణం ఏంటి అనే వివరాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. వీరి కాంబోలో చాలా సంవత్సరాల క్రితం గబ్బర్ సింగ్ అనే మూవీ రూపొందింది. ఇది హిందీ సినిమా అయినటువంటి దబాంగ్ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇక గబ్బర్ సింగ్ మూవీ ఆ టైమ్ లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. దానితో వీరిద్దరి కాంబోలో మరో మూవీ రావాలి అని పవన్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా అనుకున్నారు. వీరి కాంబోలో కొంత కాలం క్రితమే మూవీ అనౌన్స్ అయ్యింది.

వీరి కాంబోలో ఇప్పటికే వస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ తో ఓ మూవీ స్టార్ట్ కూడా అయింది. తాజాగా హరీష్ శంకర్ మాట్లాడుతూ ... పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తేరి సినిమాకి రీమిక్ అని తెలియడంతో  నాకు సోషల్ మీడియా వేదికగా ఆ మూవీ చేయొద్దు అంటూ నకి రిక్వెస్ట్ లు పంపారు. అలా కొన్ని లక్షల్లో నాకు మెసేజ్ పు కూడా వచ్చాయి. కాకపోతే పవన్ అభిమానులందరికీ నేను చెప్పేది ఒకటే. గబ్బర్ సింగ్ మూవీ దబాంగ్ కి రీమిక్. కానీ ఆ రెండు సినిమాల మధ్య పోలిక ఉండదు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తేరి కి రీమేక్ అయినప్పటికీ ఆ సినిమాకు ఈ సినిమాకు చిన్న కథా పరమైన సంబంధమే తప్ప సన్నివేశాలు అన్నీ వేరుగా ఉంటాయి. ఆ సినిమా అద్భుతంగా ఉంటుంది వారు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని హరీష్ శంకర్ తాజాగా తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: