తమిళ స్టార్ హీరో విజయ్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్క తమిళంలోనే కాకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత దేశవ్యాప్తంగా మంచి ఫాన్ ఫాలోయింగ్ కలిగిన హీరో. తెలుగు, కన్నడ, హిందీ, మళయాలం భాషల్లో కూడా విజయ్ కి పిచ్చ అభిమానులు ఉన్నారు. తమిళంలో విజయ్  నటించిన సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తున్నాయంటే ఆయన అభిమానులు ఎంతలా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. విజయ్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) ది గోట్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా అలాగే స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా వంటి సీనియర్ నటినటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. 


సెప్టెంబర్‌ 5 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ వాయిదా పడినట్టు సమాచారం తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఫ్యాన్స్ ని అబ్బురపరిచే పోరాట సన్నివేశాలు ఎన్నో ఉంటాయాని సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఏరోప్లేన్ స్టంట్ సీక్వెన్స్ ఉంటుందట. అది ఓ రేంజ్ లో ఉంటుందని ప్రముఖ తమిళ నటుడు ప్రేమ్ జి చెప్పాడు. ఇక ఈ సినిమా తరువాత విజయ్ రాజకీయాల్లో ఫుల్ గా బిజీ కానున్నాడు.విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో పార్టీ ప్రకటించిన విజయ్ దళపతి 2026 ఎన్నికలే తన లక్ష్యంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలో ఎన్నికలకు సంబంధించి అడుగులు వేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. త్వరలోనే తన అభిమానులు, కార్యకర్తలతో కలిసి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 25 వ తేదీన తిరుచ్చిలో తొలి బహిరంగ సభను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తమిళనాట వార్తలు షికార్లు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: