టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గడిచిన కొన్నేళ్ల నుండి కూడా ఈ ట్రెండ్ ని మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. మహేష్ ఫ్యాన్స్ సెట్ చేసిన ఈ ట్రెండ్, పోకిరి సినిమాతో తారాస్థాయికి చేరింది. అప్పటి నుండి కూడా ప్రతీ స్టార్ హీరో కి సంబంధించిన సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ వచ్చారు మేకర్స్.ఈ మధ్య కాలం లో ఈ ట్రెండ్ కాస్త స్లో అయ్యింది కానీ, నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మురారి’ చిత్రం గ్రాండ్ గా రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకోవడంతో మళ్ళీ రీ రిలీజ్ ట్రెండ్ అనేది బాగా ఊపు అందుకుంది. నిన్న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా కొత్త సినిమాని ఎలా అయితే రిలీజ్ చేస్తారో, ఆ రేంజ్ లో రిలీజ్ చేసారు. ఈ సినిమాకి రికార్డ్స్ ని బద్దలు కొట్టే స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. కేవలం ఒక్క నైజాం ప్రాంతం నుండే నిన్న ఈ చిత్రం ఏకంగా మూడు కోట్ల రూపాయిలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందంటే ఏ స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ ని సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా కచ్చితంగా 6 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టిందని సమాచారం తెలుస్తుంది. 


పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రం ఇంకా మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ చిత్రం రీ రిలీజ్ లో దాదాపుగా క్లోసింగ్ లో 7 కోట్ల  రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టడం జరిగింది.మహేష్ బాబు మురారి సినిమా కచ్చితంగా ఆ రికార్డుని అధిగమిస్తుంది అనే నమ్మకం తో ఉన్నారు సూపర్ స్టార్ అభిమానులు. ఇక మరో విశేషం ఏమిటంటే ఈ మూవీకి బుక్ మై షో లో ఇప్పటి దాకా 2 లక్షల 50 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ స్థాయి బుకింగ్స్ గత వారం రోజులుగా ‘కల్కి’ మూవీకి కూడా జరగలేదట. ఇంకా అంతే కాకుండా కల్కి మూవీకి నిన్న వరల్డ్ వైడ్ గా మొత్తం కలిపి 2 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, మురారి చిత్రానికి 6 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే కల్కి మీద త్రిబుల్ వసూళ్లను రాబట్టి మురారి సినిమా నిన్న సెన్సేషన్ సృష్టించింది అన్నమాట. మరి ‘మురారి’ సృష్టిస్తున్న ఈ రికార్డులను వచ్చే నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్న గబ్బర్ సింగ్ సినిమా బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: