నాగచైతన్య సమంతతో విడాకుల అనంతరం రెండో పెళ్లికి రెడీ అయిన సంగతి తెలిసిందే . తెలుగు నటి శోభిత నీ చైతు ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నాడు . ఇక త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. నిన్న మొన్నటి వరకు వీరిద్దరూ లవర్స్ అంటూ అనేక రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి . ఇక ఎట్టకేలనుకు ఆ రూమర్స్ ను వీరు నిజం చేశారు . మొత్తం గా అక్కినేని ఇంటికి కొత్త కోడలు వస్తుందని సమయంలో హాట్ టాపిక్ గా మారింది .


అసలు శోభిత ఎవరు? నాగ చైతన్య తో ఎలా పరిచయం ఏర్పడింది? వీరిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు ఇలాంటి ఎన్నో విషయాలు ప్రేక్షకులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు . ఎంగేజ్మెంట్ అనంతరం శోభిత ఫస్ట్ అండ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది ‌. నాగచైతన్య పై ఉన్న ప్రేమని తెలియజేస్తూ శోభితా ఎమోషనల్ కామెంట్స్ చేసింది ‌. కవిత్వంలోని లైన్స్ పోస్ట్ చేస్తూ చైతు పై ఎంత ప్రేమ ఉందో తెలిపింది . " నా తల్లి మీకు ఏమైనా కావచ్చు .


ఏమైనాప్పటికీ మా తండ్రి నీకు ఎలా బంధువు? మీరు నేను ఎప్పుడూ ఎలా కలిసినా .‌.. మన హృదయాల్లో ప్రేమ ఉంది . మన హృదయాలు ఎర్రటి భూమిలో మరి వర్షపు జల్లులలో తడిచిపోతాయి . విడిపోవడానికి మించి మనం కలిసిపోయాం " అంటూ శోభిత కవిత్వం పోస్ట్ చేసింది ‌ . ప్రజెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది . ఈ పోస్ట్ శోభిత చైతు గురించి పెట్టింది అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు . ఏదేమైనాప్పటికీ ప్రజెంట్ సోషల్ మీడియాలో చైతు అండ్ శోభిత పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు . వందలో 99 మంది సమంతా కి సపోర్ట్ చేస్తూ శోభితని అండ్ చైతుని తిట్టిపోస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: