ఆంధ్ర హాస్పిటల్ తో సంయుక్తంగా ఈ మెడికల్ క్యాంపును సైతం నిర్వహించినట్లు తెలుస్తోంది. సుమారుగా 157 మంది పిల్లలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించారట. వారికి అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఫోటోలను కూడా ఎంబి ఫౌండేషన్ నిర్వాహకులు షేర్ చేశారు. ఆంధ్ర హాస్పిటల్ మహేష్ బాబు కలిసి చేసిన 41వ వైద్య శిబిరం ఇది ఈ విషయంలో అన్ని విధాల కూడా సహకారాలు అందించినటువంటి హాస్పిటల్ యాజమాన్యంకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటూ ఎం బి ఫౌండేషన్ తెలియజేశారు.
అయితే మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మెడికల్ క్యాంప్ ఫోటోలు వైరల్ గా మారడంతో పలువురు అభిమానులు, నెటిజెన్స్ కూడా మహేష్ బాబు చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. సితార పుట్టినరోజున కూడా బుర్రిపాలెం లో ఇదేవిధంగానే ఉచితంగానే మెడికల్ క్యాంపులను సైతం ఏర్పాటు చేశారు ఘట్టమనేని ఫ్యామిలీ. ముఖ్యంగా పిల్లలకు ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు కడుక్కోవడం ఇతరత్రా వాటి గురించి కూడా అవగాహన కల్పించారట అలాగే పిల్లలకు అవసరమైన మందులతో పాటు టాబ్లెట్లు పోషక ఆహారంతో బాధపడుతున్న వారికి ప్రత్యేకమైన చికిత్స కూడా అందజేసినట్లుగా తెలుస్తోంది.ఇతర హీరోలు కూడా తమ కు ఏదైనా స్పెషల్ రోజున ఇలాంటివి చేస్తే బాగుంటుందని పలువురు నెటీజెన్స్ తెలుపుతున్నారు.