గత కొన్ని నెలలుగా అటు అల్లు అర్జున్ , పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ఒక యుద్ధమే జరుగుతోంది.. రోజురోజుకీ మెగా కుటుంబం అటు అల్లు కుటుంబంలా మద్యం విభేదాలు వస్తున్నాయనే అంతగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఒక సినిమా ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ ఏమి మాట్లాడను అని చెప్పాడు అప్పటినుంచి కూడా ఆ వివాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ రాజకీయాలలో 2024 లో కీలకమైన పాత్ర పోషించారు. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకుండా వైసిపి నేత తన స్నేహితుడు కి సపోర్ట్ చేయడం జరిగింది అల్లు అర్జున్.


ఇక అప్పటినుంచి అటు మెగా కుటుంబం సైతం అల్లు అర్జున్ ని దూరంపెట్టాయన వార్తలు వినిపించాయి. అయితే ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా ఒక మీటింగ్లో హీరోల గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ నీ టార్గెట్ చేస్తూ సెటైర్లు వేయడం జరిగింది.. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే కావాలనే టార్గెట్ చేశారా అన్న విషయాన్ని పక్కన పెడితే దీనివల్ల అల్లు ఫాన్స్ అయితే ఒక్కసారిగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది.


దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో పుష్ప సినిమాలోని ఒక డైలాగ్ వైరల్ గా మారుతున్నది.. అయితే ఇది కేశవ పుష్పరాజ్ మధ్య వచ్చే డైలాగ్ అన్నట్లుగా తెలుస్తోంది.. పుష్ప రాజ్ బాగా డబ్బులు సంపాదించిన తర్వాత.. కేశవ ఇలా అడుగుతూ ఇంత డబ్బు సంపాదించావ్ ఏం చేస్తావ్ మచ్చా అని అడగగా.. పుష్పరాజ్ అందుకు.. ఈ డబ్బులతో ఎమ్మెల్యే అవుతా లేకపోతే డిప్యూటీ సీఎం కూడా అవుతా అని చెబుతారట. ఎలా మచ్చా అంటే..EVM లను కొనేస్తా మచ్చా అంటు కేశవ తో చెప్పే డైలాగు ఉండబోతోంది అన్నట్లుగా సమాచారం. మరి ఇందులో డైలాగు నిజంగానే పుష్ప-2 లో ఉందా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది. ఒకవేళ ఈ డైలాగ్ ఉండి ఉంటే కచ్చితంగా అల్లు కుటుంబం మెగా కుటుంబం మధ్య మరింత వివాదం ముదిరేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: