నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా జరగడంతో చాలామంది ఎందుకు వేల కోట్ల ఆస్తికి వారసుడైన నాగచైతన్య ఎంగేజ్మెంట్ ఇంత సింపుల్గా చేశారు. రెండో పెళ్లి అని చులకనగా చూస్తున్నారా లేక అమల ఏదైనా ఇబ్బంది పెడుతుందా అని కొంతమంది నెటిజెన్స్ నాగార్జున ని అక్కినేని ఫ్యామిలీని ఉద్దేశించి సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు, పోస్ట్లు పెడుతున్నారు.అయితే తాజాగా ఇదే విషయం గురించి నాగార్జునకి కూడా ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. మరి ఇంతకీ ఆ ప్రశ్నకి నాగార్జున ఎలాంటి సమాధానం చెప్పారో ఇప్పుడు చూద్దాం.. సమంత, నాగచైతన్య పెళ్లయ్యాక మూడు సంవత్సరాలు ఎంతో హ్యాపీగా ఉన్న ఈ జంట ఆ తర్వాత సంవత్సరం ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసిందట.ఇద్దరి మధ్య పడక తరచూ గొడవలు పెట్టుకునే వారట. అలా సంవత్సరం పాటు గొడవలు పడి పడి విసిగిపోయి చివరికి నాలుగో పెళ్లిరోజు మరో నాలుగు రోజులు ఉంది అనగా విడిపోతున్నాం అంటూ పోస్ట్ పెట్టారు. 

అయితే విడాకులు తీసుకున్నాక అటు సమంత తో పాటు ఇటు నాగచైతన్య కూడా చాలా బాధపడ్డారట. మరీ ముఖ్యంగా సమంత డిప్రెషన్ తో బయట వారు చేసే ట్రోల్స్ తట్టుకోలేక మయాసైటిస్ బారిన పడింది.ఇక నాగచైతన్య కూడా ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటూ లోలోపల ఎంతో మనోవేదన అనుభవించారట  ఇక తన మనోవేదన గురించి నాగార్జున రీసెంట్గా ఓ ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..విడాకుల తర్వాత నాగచైతన్య మామూలు మనిషి కావడానికి చాలా రోజుల సమయం పట్టింది.  చాలా రోజులు తనలో తానే బాధపడ్డాడు. ప్రస్తుతం వాడు హ్యాపీగా ఉన్నాడు.అలాగే ఎంగేజ్మెంట్ ఎందుకు అంత తొందరగా చేశారని హడావిడిగా ఎందుకు కానిచ్చారు అని చాలామంది ప్రశ్న అడుగుతున్నారు.

అయితే ఎంగేజ్మెంట్ అంత హడావిడిగా చేయడానికి ప్రధాన కారణం నాగచైతన్య,శోభిత ధూళిపాళ్ల జాతకాలకు సంబంధించి ఆగస్టు 8న మంచి ముహూర్తం ఉందని జ్యోతిష్యుడు చెప్పడంతో హడావిడిగా ఈ ముహూర్తానికే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసాం. అయితే మొదట్లో కొద్ది సమయం తీసుకొని మరో మంచి రోజులో ఫిక్స్ చేద్దాం అనుకున్నాం.కానీ అమల మాత్రం వారి జాతకాల కి ఇదే మంచి ముహూర్తం కాబట్టి అదే ముహూర్తానికి ఫిక్స్ చేసి ఇద్దరి ఎంగేజ్మెంట్ ని అదే రోజు పెట్టుకుందాం అని చెప్పింది. అందుకే వారిద్దరి భవిష్యత్తు బాగుండాలని ఇద్దరి జాతకాల ప్రకారం ఆగస్టు 8న మంచి ముహూర్తం కావడంతో హడావిడిగా చేయాల్సి వచ్చింది అంటూ నాగార్జున చెప్పారు.అంతేకాకుండా రెండో పెళ్లి అని అలా సింపుల్గా చేస్తున్నాం అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇక ఎంగేజ్మెంట్ తొందరగా కానిచ్చేసాం కానీ పెళ్లికి మాత్రం కాస్త సమయం ఉంది అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: